HAL Shares Price: చరిత్ర సృష్టించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. రికార్డు స్థాయికి HAL షేర్స్.. ఏకంగా..

|

Jul 24, 2023 | 10:47 AM

Modi Govt - HAL Shares: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ఇప్పటికే పలు రంగాలు వృద్ధి వైపు పయనిస్తున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి.

HAL Shares Price: చరిత్ర సృష్టించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. రికార్డు స్థాయికి HAL షేర్స్.. ఏకంగా..
Hal
Follow us on

Modi Govt – HAL Shares: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ఇప్పటికే పలు రంగాలు వృద్ధి వైపు పయనిస్తున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. భారత రక్షణ, విమానయాన రంగంలోని కీలక సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వృద్ధిలో మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేరు ధర రూ.3857.9కి చేరింది. ఐదేళ్ల క్రితం వెయ్యి రూపాయల లోపే ఉన్న హెచ్‌ఏఎల్ షేర్ ధర.. ఐదేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది.

ఐదేళ్లలో హెచ్‌ఏఎల్ సాధించిన ఈ విజయం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికే చెందుతుందని ఎన్డీఏ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హెచ్ఏఎల్ ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని విపక్షాలు ఆరోపణలు చేశాయని.. కానీ దాని షేర్ లు పెరగడం ఆ ఆరోపణలు నిరాధారమని గుర్తుచేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Hal Shares

అయితే హెచ్‌ఏఎల్ యుద్ధ విమానం తేజస్, లైట్ వెయిట్ హెలికాప్టర్ ధృవ్ వంటి వాటిని ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు హెచ్‌ఏఎల్‌తో చర్చలు జరుపుతున్నాయి.

భారత వైమానిక దళం కోసం తేజస్, ధ్రువ్, ప్రచండ, రుద్ర వంటి విమానాలు, హెలికాప్టర్లను HAL తయారు చేస్తోంది. దీనితో పాటు, ఈ సంస్థ భారత వైమానిక దళం కోసం భవిష్యత్ యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేస్తోంది. రష్యా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలను సైతం హెచ్‌ఏఎల్ తయారు చేసింది.

ప్రస్తుతం LCA (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)ని కంపెనీ తయారు చేస్తోంది. దీనినే తేజస్ అని కూడా అంటారు. దీనితో పాటు, ఈ కంపెనీ డోర్నియర్ వంటి ప్రయాణీకుల విమానాలను కూడా తయారు చేస్తుంది. HAWK, IJT, HTT-40 వంటి శిక్షణా విమానాలను కూడా HAL తయారు చేసింది. ఇంకా HAL ధృవ్, చిరుత, చేతక్, లాన్సర్, చీతల్, రుద్ర, LCH, LUHలను తయారు చేస్తుంది.

భారతీయ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ – డిఫెన్స్ కంపెనీ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను 23 డిసెంబర్ 1940న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. HAL ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీదారులలో ఒకటిగా ఉంది.