Anand Mahindra: ప్రధాని మోదీ రోడ్‌షోపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. ఇంతకీ ఏమన్నారంటే..

Anand Mahindra: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం మనందరికీ తెలిసినవిషయమే. ఈ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) గుజరాత్ పర్యటన చేశారు.

Anand Mahindra: ప్రధాని మోదీ రోడ్‌షోపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. ఇంతకీ ఏమన్నారంటే..
Anand Mahindra

Updated on: Mar 18, 2022 | 7:40 AM

Anand Mahindra: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం మనందరికీ తెలిసినవిషయమే. ఈ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) గుజరాత్ పర్యటన చేశారు. అందులో భాగంగా రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేధికగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రధాని పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఖరీదైన కార్లను పక్కనబెట్టారు. వాటికి బదులుగా మోదీ మహీంద్రా ఆటో సంస్థకు చెందిన ఆఫ్‌ రోడ్‌ వెహికిల్‌ మహీంద్రా థార్‌లో ప్రయాణించారు. సుమారు 9 కిలోమీటర్ల పాటు ఇదే దేశీయ వాహనంలో ప్రధాని ప్రయాణం చేశారు. దేశవ్యాప్తంగా ఆఫ్‌ రోడ్‌ సెగ్మెంట్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీగా మహీంద్రా థార్‌కు మంచి గుర్తింపు ఉంది.

దేశ ప్రధాని తమ కంపెనీకి చెందిన వాహనాన్ని పర్యటనలో వినియోగించటం ఆనంద్ మహీంద్రాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దీనిపై ఆయన ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ” ఎన్నికల గెలుపు పరేడ్‌ను నిర్వహించేందుకు మేడిన్ ఇండియా వెహికల్ కంటే మెరుగైనది ఏదీ లేదు. ధన్యవాదాలు ప్రధాని నరేంద్రమోదీ” అని తన ట్వీట్ ద్వారా మహీంద్రా తెలిపారు. ప్రస్తుతం దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇవీ చదవండి..

Gold ATM: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్ లో గోల్డ్ ఏటిఎంలు..

Crude Oil: రష్యా ఆఫర్ కు భారత చమురు కంపెనీలు ఫిదా.. భారీగా ముడి చమురు దిగుమతికి ఆర్డర్లు..