Jeff Bezos: కొంపముంచిన జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానం.. గుడ్‌బై చెబుతున్న అమెజాన్ యూజర్లు.. ఎందుకంటే.!

|

Aug 15, 2021 | 3:50 PM

Jeff Bezos: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌... ఇటీవల బ్లూఆరిజిన్‌ రాకెట్‌‌తో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ద్వారా చరిత్రలో తనకంటూ..

Jeff Bezos: కొంపముంచిన జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానం.. గుడ్‌బై చెబుతున్న అమెజాన్ యూజర్లు.. ఎందుకంటే.!
Amazon
Follow us on

Jeff Bezos: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌.. ఇటీవల బ్లూఆరిజిన్‌ రాకెట్‌‌తో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ద్వారా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నట్లు జెఫ్ బెజోస్ ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ యాత్రే ఆయన కొంప ముంచుతోంది. ఈ యాత్ర విజయవంతంగా పూర్తయ్యాక.. ఇది సాధ్యమవ్వడానికి కారణం మీరే.. మీరు చెల్లించిన పన్నుల ద్వారానే ఇది సాధ్యమైంది అంటూ.. బెజోస్.. అమెజాన్ ఉద్యోగులు, కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలిసిన వెంటనే అమెరికాలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఆయనపై తీవ్రంగా మండిపడుతూ.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకుంటున్నారు.

అయితే బెజోస్ ఈ రోధసి యాత్ర చేయడానికి ప్రధాన కారణం.. అమెజాన్ కస్టమర్లు, సబ్‌స్క్రైబర్లు చెల్లించిన పన్నులే. అవే లేకపోతే ఆయన ఇంత సంపన్నుడు అయ్యేవాడు కాదు. ఇలా అంతరిక్ష ప్రయాణం చేసేవాడు కాదు. ఈ పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో వెళ్లొచ్చారనే ఆగ్రహంతో ఉన్న సబ్‌స్క్రైబర్లు ఆయనపై మండిపడుతున్నారు. నిజానికి జెఫ్ బెజోస్ ఇలా చెప్పడం ద్వారా ప్రజలు తనను ఇంకా ఎక్కువగా మెచ్చుకుంటారని భావించారు. మీ వల్లే ఇది సాధ్యమైంది అని అంటే.. ప్రజలు మావల్లే ఇలా సాధ్యమైందని ఆనందపడతారని అనుకున్నారు. కానీ ప్రజలు అలా రిసీవ్ చేసుకోలేదు. తమ డబ్బుతో, అమెజాన్ ఉద్యోగుల డబ్బుతో బెజోస్ ఈ యాత్ర చేశారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఉద్యోగులపై ఒత్తిడి..

అమెజాన్ సంస్థ తమ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. సమయానికి డెలివరీ పంపేలా చేసేందుకు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు చాలా మంది అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ వదిలేసుకొని తాము చాలా మంచి పని చేశామని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. మిగతా వారు కూడా వదిలేసుకోమని కోరుతున్నారు. ఇదో ఉద్యమంలా సాగుతోంది. కాగా, జెఫ్ బెజోస్ జూలై 20న 11 నిమిషాల్లో అంతరిక్ష యాత్ర చేశారు. దీని కోసం రూ.206 కోట్లు ఖర్చు చేశారని అంచనా. ఈ యాత్ర తర్వాత ఆయన పలుకుబడి తగ్గింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. బెజోస్‌ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గుడ్స్‌ సంస్థ లూయిస్‌ విట్టన్‌ మోయెట్‌ హెన్నెస్సీ(LVMH) చీఫ్ బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ పొందారు. ఆయన 200.5 బిలియన్‌ డాలర్లతో మొదటిస్థానంలో ఉండగా.. 190.7 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు.

 

ఇవీ కూడా చదవండి

Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ తప్పుగా ఉందా..? అయితే మార్చుకోండిలా..!

Gold Hallmarking: హాల్‌మార్కింగ్‌ విధానంలో కేంద్రం కొత్త నిబంధనలు.. ఆగస్టు 31 నుంచి మరనున్న రూల్స్‌..!