
Amazon Great Indian Festival: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ తన సేల్ తేదీని ప్రకటించగా, ఇప్పుడు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ తేదీని కూడా ప్రకటించింది. ఈ ఏడాది అతిపెద్ద సేల్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరో శుభవార్త వచ్చింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. అంటే టీవీ, ఏసీ వంటి వస్తువుల ధర తగ్గుతుంది. దీని ప్రభావం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌పై కూడా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు.. రూ. 1 లక్షా 10 వేల చేరువలో..
అమెజాన్ సేల్ తేదీ ఎప్పుడు?
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ సేల్ ఎప్పటి వరకు ఉంటుందనేది వెల్లడించలేదు. ఈ సేల్‌లో అతి తక్కువ ధరల్లోనే ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే సేల్‌ను ప్రారంభంలో మంచి ఆఫర్లు అందుబాటులో ఉండటం వల్ల చాలా మంది సేల్ ప్రారంభమైన వెంటనే షాపింగ్ ప్రారంభిస్తారు. తరువాత డిస్కౌంట్ తగ్గుతుంది. ధర కూడా పెరుగుతుంది. అందుకే సేల్ ప్రారంభమైన వెంటనే ప్రజలు షాపింగ్ చేస్తారు.
ఈసారి మీరు టీవీ లేదా ఏసీ కొనాలని ఆలోచిస్తుంటే కొద్దిగా ఆగండి. 23 తర్వాత కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్లతో పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గింపు ప్రకటన తర్వాత టీవీలు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వేల రూపాయల చౌకగా మారనున్నాయి. స్మార్ట్ టీవీలపై ఇప్పటివరకు 28 శాతం పన్ను ఉండగా, దీనిని 18 శాతానికి తగ్గించింది కేంద్రం.
ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. వీటిపై భారీ డిస్కౌంట్లు
ఈ సేల్‌లో టీవీ-ఏసీ కొనాలనుకునే వారు సెప్టెంబర్ 22 వరకు వేచి ఉండాలి. సెప్టెంబర్ 22 నుండి వారికి ఉత్పత్తులు మరింత చౌకగా లభిస్తాయి. ఎందుకంటే సేల్‌లోని ఉత్పత్తులపై బ్యాంక్ డిస్కౌంట్లు, అనేక ఆఫర్లు లభిస్తాయి. అదే సమయంలో సెప్టెంబర్ 22న కొత్త రేట్లు అమలులోకి వచ్చినప్పుడు, టీవీ-ఏసీ ధరలు మరింత తక్కువగా ఉంటాయి.
ఇందులో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై హెచ్‌పీ, బోట్, సోనీ వంటి బ్రాండ్లపై 80శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ప్రతీ సంవత్సరం దసరా, దీపావళి సీజన్‌లో జరిగే ఈ సేల్‌కు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈ సారి కూడా భారీ ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!