AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 100 coin: వంద రూపాయల నాణెం స్పెషాలిటీ ఏంటి? మనం కూడా వాడొచ్చా?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగాప్రధాన మంత్రి మోదీ వంద రూపాయల స్మారక నాణేన్ని విడుదలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది మనకు కూడా అందుబాటులోకి వస్తుందా? అసలు దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Rs 100 coin: వంద రూపాయల నాణెం స్పెషాలిటీ ఏంటి? మనం కూడా వాడొచ్చా?
Rs 100 Coin
Nikhil
|

Updated on: Oct 05, 2025 | 3:32 PM

Share

వంద రూపాయల నాణెం ఒక స్మారక నాణెం. అంటే ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా తయారుచేసిన నాణెం. దీనిపై భారత్ మాత చిత్రం ముద్రించి ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఒక నాణెంపై భారత్ మాత చిత్రం ముద్రించడం ఇదే ఫస్ట్ టైం. ఒక వైపున భారతదేశ జాతీయ చిహ్నం, మరొక వైపున భారత్ మాత చిత్రం కనిపిస్తుంది.  అయితే ఈ కాయిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందా అని చాలామందిలో డౌట్ ఉంది. అసలు విషయం ఏంటంటే..

స్మారక నాణెం

వంద రూపాయల కాయిన్ అనేది లావాదేవీల కోసం రిలీజ్ చేసిన కాయిన్ కాదు. దీన్ని అందరూ పొందలేరు. ఆన్ లైన్ లో  ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వంద రూపాయల నాణెం అనేది జ్ఞాపకార్థంగా తయారుచేసిన కాయిన్. ఇది రెగ్యులర్ కరెన్సీలాగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీన్ని పొందాలంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్ సైట్ లో ఆర్డర్ చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా..

ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో వాడుకలో ఉన్న నాణేలు చాలానే ఉన్నాయి. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు,  10 రూపాయలు, 20 రూపాయల నాణేలు సాధారణంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఇవన్నీ భారతీయ కరెన్సీ వ్యవస్థలో చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే కాయిన్స్. అంటే వీటిని ఏదైనా ప్రభుత్వ లేదా బ్యాంక్ లావాదేవీల్లో ఉపయోగించొచ్చు. అయితే చెల్లుబాటు లేని కాయిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవే రూ. 75, రూ.90, రూ.125, రూ.150 నాణేలు. అంతేకాదు వెయ్యి రూపాయల నాణెం కూడా ఉంది. అయితే ఇవన్నీ స్మారక నాణేల కిందకి వస్తాయి. వీటిని సాధారణ లావాదేవీల్లో ఉపయోగించరు. రీసెంట్ గా విడుదల చేసిన వంద రూపాయల కాయిన్ కూడా ఇలాంటిదే. దీన్ని మన రోజువారీ ట్రాన్సాక్షన్స్ కు  అందుబాటులో ఉండదు. మీరు ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా కొనుగోలు చేయాలి అనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇ‍క్కడ క్లిక్‌ చేయండి

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్