- Telugu News Photo Gallery Business photos Save Money Monthly: 7 Smart Financial Tips to Avoid Month End Cash Crunch
Personal Finance: నెలాఖరులో డబ్బులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ట్రిక్స్ పాటిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు!
Personal Finance: చాలామందికి నెలాఖరుకు డబ్బులు అయిపోవడం, ఖర్చుల నియంత్రణ లేకపోవడం సాధారణ సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా, మీ జేబుకు ఉపశమనం కలిగించే కొన్ని సులభమైన చిట్కాలను ఈ కథనం వివరిస్తుంది. విద్యుత్, నీటి పొదుపు నుండి మొబైల్ బిల్లుల..
Updated on: Oct 05, 2025 | 3:24 PM

Personal Finance: చాలా మందికి నెల జీతం రాగానే వెంటనే ఖర్చు అయిపోతుంటుంది. అలాగే నెలాఖరులో జేబులో ఒక్క పైసా కూడా ఉండదు. ఇలాంటి సమస్య చాలా మందే ఎదుర్కొంటుంటారు. నెలాఖరు సమయంలో చిన్నపాటి ఖర్చు పెడడతామన్న కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ జేబుకు ఉపశమనం కలిగించే చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు. మీ జీవితాన్ని సులభతరం చేసే ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.

విద్యుత్తు, నీటిని తెలివిగా వాడండి: మీ విద్యుత్ బిల్లు చూసి మీరు గందరగోళానికి గురవుతున్నారా? అప్పుడు స్మార్ట్ అవ్వాల్సిందే. ఇంట్లో విద్యుత్‌ను పొదుపుగా వాడండి. తక్కువ వాట్స్ ఉన్న బల్బులను వాడటం మంచిది. అలాగే బ్లాక్అవుట్ కర్టెన్లను ఉపయోగించండి. థర్మోస్టాట్‌ను సరైన ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. అలాగే నీటిని జాగ్రత్తగా వాడుకోండి. లీకేజీని తనిఖీ చేయండి. అవసరానికి మించి ఉపయోగించవద్దు. ఈ చిన్న మార్పులు మీ విద్యుత్, నీటి బిల్లులను తగ్గించుకోవచ్చు. మీ ఇంటిని కొంచెం స్మార్ట్‌గా చేయండి.

మీ మొబైల్ బిల్లుకు పరిమితి విధించండి: ప్రతి నెలా మీ మొబైల్ బిల్లు వల్ల ఖర్చు పెరుగుతుటుంది. మీరు ఎక్కువ డేటాను ఉపయోగించకపోతే, తక్కువ డేటా ఉన్న ప్లాన్‌ను ఎంచుకోండి. అలాగే చౌకైన ఫ్యామిలీ లేదా గ్రూప్ ప్లాన్ కోసం చూడండి. మళ్ళీ మళ్ళీ కొత్త ఫోన్ కొనే అలవాటును వదులుకోండి. మీ పాత ఫోన్ కూడా చాలా సంవత్సరాలు ఉంటుంది. ఈ చిన్న విషయాలను గుర్తుంచుకోండి. అలాగే ప్రతి నెలా మీ జేబులో వేల రూపాయలు ఆదా చేసుకోండి.

బయట తినడం మానుకోండి: ప్రతి వారాంతంలో స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌లో తినడం, పిజ్జా ఆర్డర్ చేయడం లేదా ఫుడ్ డెలివరీ యాప్‌లను ఉపయోగించడం మీకు ఖర్చు పెంచేలా ఉంటాయి. బయట తినడం ఖరీదైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా హానికరం. ఇందులో బయటి ఫుడ్ తినకుండా ఇం ట్లోనే తినడం మంచిది. ఇది చౌకగా ఉండటమే కాకుండా, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది. వారానికి ఒకసారి ఇంట్లో ప్రత్యేకంగా ఏదైనా వండుకోండి. ఈ అలవాట్ల వల్ల మీరు చాలా పొదుపు చేసుకోవచ్చు.

ప్రజా రవాణాను వాడుకోండి: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మీరు ప్రతిరోజూ మీ కారును బయటకు తీస్తుంటే, మీ జేబుకు భారం పెరిగినట్లే. బస్సు, మెట్రో లేదా షేరింగ్ క్యాబ్‌లను ఉపయోగించండి. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు మెట్రోలో ప్రయాణించి మీ జేబులో కొంత డబ్బు ఆదా చేసుకోండి.

పనికిరాని సబ్‌స్క్రిప్షన్‌లకు టాటా చెప్పండి: మీరు ఎన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, జిమ్ సభ్యత్వాలు లేదా మ్యాగజైన్ సభ్యత్వాలకు చెల్లిస్తున్నారో తనిఖీ చేశారా? వీటిలో మీరు ఎన్ని ఉపయోగిస్తున్నారు? చాలా మంది ఎప్పుడూ ఉపయోగించని అనేక సభ్యత్వాలను కొనుగోలు చేస్తారు. అందుకే ఇప్పుడు ఈ పనికిరాని ఖర్చులకు వీడ్కోలు చెప్పండి. మీరు ఉపయోగించని సభ్యత్వాలను వెంటనే రద్దు చేసుకోండి. వీటి వల్ల ప్రతి నెల డబ్బు ఆదా అవుతుంది. డబ్బు ఆదా చేయడం కష్టమైన పని కాదు. దీనికి కొంచెం ప్రణాళిక, తెలివైన నిర్ణయాలు మాత్రమే అవసరం. ఈ చిట్కాలను మీ జీవితంలో అమలు చేయండి. డబ్బును ఎంతో ఆదా చేసుకోవచ్చు.




