Income Tax: రిటైర్డ్ ఉద్యోగులకు పన్ను పోటు నుంచి రక్షణ.. ఈ టిప్స్ పాటించడం మాత్రం మస్ట్
భారతదేశంలోని పౌరులు నిర్ణీత ఆదాయం దాటిన ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఆదాయపు పన్ను విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మాత్రం ఆదాయపు పన్ను ఫైల్ చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వారికి పన్ను బాధ నుంచి విముక్తి కల్పించేలా ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఓ నోట్‌ను విడుదల చేసింది.

ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పదవీ విరమణ చేసిన వ్యక్తులకు వర్తించే పన్ను మినహాయింపులు తగ్గింపులను వివరిస్తూ “రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యక్ష పన్నుల కింద ప్రయోజనాలు” అనే శీర్షికతో ఇటీవల ఒక బ్రోచర్‌ను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ధారించి పెన్షన్లు, గ్రాట్యుటీ, సెలవు ఎన్‌క్యాష్‌మెంట్, వైద్య ఖర్చులు, వడ్డీ ఆదాయాలను ఎలా పరిగణిస్తారో? పేర్కొన్నారు. ముఖ్యంగా పాత, కొత్త పన్ను విధానాలకు మార్గదర్శకత్వాన్ని తెలుపుతుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పన్ను చెల్లింపుదారులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించారు.
మినహాయింపు పరిమితులు
పాత విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లు (60-80 సంవత్సరాలు) రూ. 3 లక్షల ప్రాథమిక మినహాయింపును పొందుతారు అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు (80+) రూ. 5 లక్షల మినహాయింపును పొందుతారు. కొత్త విధానం ప్రకారం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వ్యక్తులకు మినహాయింపు రూ.3 లక్షలు ఉంటుంది.
పెన్షన్‌పై పన్ను
జీతాలు మినహాయింపు పరిమితిని దాటిన తర్వాత స్వతంత్ర యాన్యుటీ ప్లాన్ల నుంచి వచ్చే పెన్షన్లపై ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పేర్కొంటూ పన్ను విధిస్తారు. 2020-21 సంవత్సరం నుంచి పాత విధానంలో రూ. 50,000 తగ్గింపు అనుమతిస్తున్నారు. కొత్త విధానంలో 2025-26 సంవత్సరం నుంచి ఈ తగ్గింపు రూ. 75,000కి పెంచారు.
ముందస్తు పన్ను మినహాయింపు
వ్యాపారం లేదా వృత్తి లాభాలు కింద ఆదాయం లేని సీనియర్ సిటిజన్లు రూ. 10,000 కంటే తక్కువ బాధ్యత కలిగి ఉంటే ముందస్తు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు.
పన్ను స్లాబ్‌లు
పాత విధానం (60-80 సంవత్సరాలు) రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు, రూ. 3-5 లక్షలు – 5 శాతం, రూ. 5-10 లక్షలు 20 శాతం, రూ. 10 లక్షలకు పైన 30 శాతం ఉంది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు (80+) రూ. 5 లక్షల వరకు పన్ను లేదు. కొత్త విధానంలో రూ. 3-7 లక్షలు – 5 శాతం, రూ. 7-10 లక్షలు 10 శాతం, రూ. 10-12 లక్షలు 15 శాతం, రూ. 12-15 లక్షలు – 20 శాతం రూ.15 లక్షలకు పైగా – 30 శాతం ఉంది.
గ్రాట్యుటీ
గ్రాట్యుటీ కింద చెల్లింపులు వస్తే పూర్తిగా మినహాయింపు కేంద్ర ప్రభుత్వంచట్టబద్ధమైన పరిమితుల్లో గ్రాట్యుటీ చట్టం ప్రకారం లేదా నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
వైద్య చికిత్స
పాత విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు నిర్దిష్ట వ్యాధులకు రూ. 1 లక్ష వరకు మినహాయింపు లభిస్తుంది.
వడ్డీ ఆదాయం
బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా సహకార బ్యాంకుల నుండి వచ్చే వడ్డీపై రూ. 50,000 వరకు తగ్గింపు. సంస్థలు, ఏఓపీలు లేదా బీఓఐలకు వర్తించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








