RBI Gold Reserve: బంగారం నిల్వలను పెంచిన ఆర్బీఐ.. 57 టన్నుల గోల్డ్ కొనుగోలు.. మొత్తం ఎంతో తెలుసా?
RBI Gold Reserve: బంగారం సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు. అలాగే ఇది విదేశీ మారక నిల్వలలో ముఖ్యమైన భాగం. ప్రపంచ అస్థిరతను, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ బంగారంలో తన వాటాను పెంచుతోంది. ఈ సంవత్సరం ఆర్‌బిఐ..

RBI gold reserve: 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2025 నాటికి మొత్తం 879.58 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇది ఒక సంవత్సరం క్రితం 822.10 మెట్రిక్ టన్నులు. అంటే, FY25లో 57.48 మెట్రిక్ టన్నుల పెరుగుదల ఉంది. FY25 లో ఆర్టీఐ తన బంగారు నిల్వలను పెంచడమే కాకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశ ఆర్థిక బలాన్ని కూడా బలోపేతం చేసింది.
బంగారం నిల్వ విలువ 57.12 శాతం పెరిగింది:
నివేదిక ప్రకారం, మార్చి 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం విలువ రూ. 2,74,714.27 కోట్లు. ఇది మార్చి 31, 2025 నాటికి రూ.4,31,624.80 కోట్లకు పెరిగింది. అంటే 57.12 శాతం పెరుగుదల ఉంది. ఈ పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది 57.48 మెట్రిక్ టన్నుల అదనపు బంగారం కొనుగోలు, రెండవది అంతర్జాతీయ బంగారం ధరల పెరుగుదల. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం.
బ్యాంకింగ్, ఇష్యూ విభాగంలో బంగారం పంపిణీ:
మార్చి 31, 2025 నాటికి బ్యాంకింగ్ శాఖ వద్ద మొత్తం 568.20 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. గత సంవత్సరం ఇది 514.07 మెట్రిక్ టన్నులు. 2024లో 308.03 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, ఇష్యూ విభాగంలో మార్చి 31, 2025 నాటికి 311.38 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది.
ఆర్‌బీఐ బంగారంలో ఎందుకు పెట్టుబడి పెడుతుంది?
బంగారం సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు. అలాగే ఇది విదేశీ మారక నిల్వలలో ముఖ్యమైన భాగం. ప్రపంచ అస్థిరతను, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ బంగారంలో తన వాటాను పెంచుతోంది.
ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో పెరుగుదల:
ఈ సంవత్సరం ఆర్‌బిఐ బ్యాలెన్స్ షీట్ 8.2 శాతం పెరిగి రూ.70.47 లక్షల కోట్ల నుంచి రూ.76.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం దేశీయ, విదేశీ పెట్టుబడుల పెరుగుదలతో పాటు బంగారు నిల్వలు వేగంగా పెరగడం. మార్చి 31, 2025 నాటికి ఆర్బీఐ మొత్తం ఆస్తులలో 25.73 శాతం దేశీయ ఆస్తులు (ప్రభుత్వ బాండ్లు వంటివి) ఉండగా, 74.27 శాతం విదేశీ కరెన్సీ, బంగారం, ఇతర విదేశీ పెట్టుబడులు ఉన్నాయి.
విదేశీ మారక నిల్వల్లో బంగారం విలువ రూ.2.28 లక్షల కోట్లు (52.09 శాతం) పెరిగి రూ.6.68 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం విదేశీ మారక నిల్వలు 5.95 శాతం పెరిగి రూ.57.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




