SBI Customers Alert: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మిస్డ్ కాల్ తోనే బ్యాంక్ స్టేట్ మెంట్.. వివరాలివి..

ఎస్బీఐ ఆన్ లైన్, యోనో యాప్ లలో వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తోంది. అలాగే టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఎంఎస్ ల వంటి వాటి ద్వారా ఖాతా బ్యాలెన్స్ వివరాలు ఇస్తోంది. ఇప్పుడు మినీ స్టేట్‌మెంట్‌ను కూడా మిస్డ్ కాల్ ద్వారా వచ్చేలా ఏర్పాట్లు చేసింది.

SBI Customers Alert: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మిస్డ్ కాల్ తోనే బ్యాంక్ స్టేట్ మెంట్.. వివరాలివి..
Sbi
Follow us
Madhu

|

Updated on: Jan 29, 2023 | 3:35 PM

మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతో కూడిన సదుపాయాలను అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ఎస్బీఐ ఆన్ లైన్, యోనో యాప్ లలో వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తోంది. అలాగే టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఎంఎస్ ల వంటి వాటి ద్వారా ఖాతా బ్యాలెన్స్ వివరాలు అందిస్తుండగా.. ఇప్పుడు మినీ స్టేట్‌మెంట్‌ను కూడా మిస్డ్ కాల్ ద్వారా వస్తోంది.

ఫోన్ నంబర్ లింకై ఉంటేనే..

ఖాతాదారులకు ముఖ్యంగా అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ ఎక్కువగా అవసరం అవుతాయి. వీటిని తక్షణం పొందేందుకు ఎస్బీఐ అనేక రకాల మార్గాలను ప్రవేశపెట్టింది. కస్టమర్లు ఎస్బీఐ క్విక్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ మార్గాల్లో మినీ-స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. అయితే స్టమర్‌లు తప్పనిసరిగా వారి ఫోన్ నంబర్‌ను ఖాతాకు లింక్ చేసుకొని ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మినీ స్టేట్‌మెంట్‌లో NEFT, RTGS, IMPS, UPI వంటి వివిధ మోడ్‌ల ద్వారా నిర్వహించబడే అన్ని లావాదేవీల వివరాలు ఉంటాయి.

బ్యాలెన్స్ ఇలా.. ఎస్బీఐ టోల్-ఫ్రీ నంబర్ 9223766666 ద్వారా కస్టమర్లు వారి ఫోన్లోనే ఎస్ఎంఎస్ లేదా కాల్ చేయడం ద్వారా బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు. మినీ స్టేట్ మెంట్ ఇలా.. గత 5 లావాదేవీల గురించి తెలుసుకోవడానికి SBI మినీ స్టేట్‌మెంట్ నంబర్ 09223866666కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రెండు రింగ్‌ల తర్వాత కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వినియోగదారు ఫోన్ కి మినీ స్టేట్‌మెంట్‌తో ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఖాతాపై ఇటీవల చేసిన ఐదు లావాదేవీలు అందులో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఇలా..

  • ఎస్ఎంఎస్, లేదా మొబైల్ సేవలను పొందేందుకు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాకు ఫోన్ నంబర్ ను లింక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 09223488888కి ‘REG Account Number’అని SMS పంపాలి.
  • ఇది విజయవంతం అయినట్లు మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు లెక్క.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..