Telugu News Business Alert to PM Kisan beneficiaries, PM Kisan rules are changed, pm kisan rules in telugu
PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం-కిసాన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ఈ పథకం ఇతర పథకాలకు దిక్సూచిలా మారింది. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నప్పటికీ రైతులు చేసే ఒక్క తప్పు పథకానికి సంబంధించిన అర్హతను కోల్పేయేలా చేస్తుంది.
భారతదేశంలో పీఎం-కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం చేస్తారనే విషయం చాలా మందికి తెలుసు. పీఎం-కిసాన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ఈ పథకం ఇతర పథకాలకు దిక్సూచిలా మారింది. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నప్పటికీ రైతులు చేసే ఒక్క తప్పు పథకానికి సంబంధించిన అర్హతను కోల్పేయేలా చేస్తుంది. కొంతమంది లబ్ధిదారులు లోన్ల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పథకానికి అర్హత కోల్పోతారు. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్ అర్హతల గురించి ఓ సారి తెలుసుకుందాం.
అన్ని సంస్థాగత భూమి హోల్డర్లు అంటే అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు క్రింది వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు.
మాజీ, ప్రస్తుత రాజ్యాంగ పదవులను కలిగి ఉన్నవారు
మాజీ, ప్రస్తుత నాయకులు/ రాష్ట్ర మంత్రులు మరియు లోక్‌సభ/ రాజ్యసభ/ రాష్ట్ర శాసనసభలు/ రాష్ట్ర శాసన మండలి మాజీ/ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల మాజీ, ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల మాజీ మరియు ప్రస్తుత అధ్యక్షులు.
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్‌మెంట్‌లు మరియు దాని ఫీల్డ్ యూనిట్లు కేంద్ర లేదా రాష్ట్ర పీఎస్ఈలు, అటాచ్డ్ కార్యాలయాలు/స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థలు అలాగే స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ సిబ్బంది/తరగతి మినహా) సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు మరియు ఉద్యోగులు lV/గ్రూప్ డీఉద్యోగులు).
నెలవారీ పెన్షన్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న (మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/ గ్రూప్ డీ ఉద్యోగులు మినహా) అన్ని సూపర్‌యాన్యుయేట్/రిటైర్డ్ పెన్షనర్లు.
గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు.
వైద్యులు, ఇంజనీర్ల లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్నవారు
ఫిబ్రవరి 28, 2024న మహారాష్ట్రలోని యవత్మాల్‌లో తన పర్యటన సందర్భంగా 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల విలువైన పీఎం-కిసాన్ పథకానికి సంబంధించిన 16వ విడతను ప్రధాని విడుదల చేశారు. 15వ విడతను నవంబర్ 15, 2023న మోదీ విడుదల చేశారు. పీఎం-కిసాన్ పథకం కింద, అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 పొందుతారు. ఇది సంవత్సరానికి రూ. 6,000. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో డబ్బు అందిస్తారు. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.