భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. గతంలో స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడిపెడితే ప్రస్తుతం అధిక రాబడి కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడి ధోరణి చూస్తుంటే భారతీయుల్లో ఆర్థిక అక్షరాస్యత పెరిగిందని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మ్యూచువల్ పండ్ ఖాతాదారులకు సెబీ ఓ కీలక సూచన చేసింది. డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్-రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ల ద్వారా పెట్టుబడిదారు ట్రేడ్ చేసే సెక్యూరిటీల ఖాతాను అందించే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన డిఫాల్ట్ మోడ్‌గా ఈ-మెయిల్‌ను మార్కెట్‌ల నియంత్రణ సంస్థ సెబీ తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సర్క్యులర్‌లో తెలిపింది. కాబట్టి సెబీ నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది అన్ని మ్యూచువల్ ఫండ్‌లు, డీమెటీరియలైజ్డ్ (డీమ్యాట్) మోడ్‌లో ఉన్న ఇతర సెక్యూరిటీలలో ఒక నెలలో పెట్టుబడిదారుడు చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలను చూపే ఒక సింగిల్ లేదా కంబైన్డ్ అకౌంట్ స్టేట్‌మెంట్. ఆర్‌టీఏలు, డిపాజిటరీలలో పాన్‌లు సాధారణంగా ఉంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డిపాజిటరీ ఖాతాలు రెండింటిలోనూ ఆర్థిక లావాదేవీల వివరాలను అందించడం ద్వారా డిపాజిటరీలు పెట్టుబడిదారులకు సీఏఎస్ పంపుతారు. మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి ఆర్‌టీఏలు, డిపాజిటరీల మధ్య ఉమ్మడి పాన్ లేనప్పుడు మ్యూచువల్ ఫండ్ లావాదేవీలను మాత్రమే కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే సీఏఎస్ పంపుతారు. డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ మోడ్ ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన కమ్యూనికేషన్ మోడ్‌గా మారినందును ఖాతా స్టేట్‌మెంట్‌లను పంపే విధానంపై రెగ్యులేటరీ మార్గదర్శకాలను క్రమబద్ధీకరించడానికి రెగ్యులేటరీ నిబంధనలను సవరించామని సెబీ తెలిపింది.
సెబీ తన సర్క్యులర్‌లో డిపాజిటరీలు, ఏఎంసీలు లేదా ఎంఎఫ్-ఆర్‌టీఏల్లో ఈ-మెయిల్ చిరునామాలు నమోదు చేసిన పెట్టుబడిదారులందరికీ సీఏఎస ఈ-మెయిల్ ద్వారా పంపుతారు. అయితే ఒక పెట్టుబడిదారుడు ఈ-మెయిల్ ద్వారా సీఏఎస్‌ను స్వీకరించకూడదనుకుంటే పెట్టుబడిదారుడు భౌతిక రూపంలో స్వీకరించడానికి ఒక ఎంపిక ఇస్తారు. పెట్టుబడిదారుడి డీమ్యాట్ ఖాతాల్లో లేదా అతని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలలో ఏదైనా లావాదేవీ జరిగితే సీఏఎస్ ఆ పెట్టుబడిదారుడికి నెలవారీ ప్రాతిపదికన ఈ-మెయిల్ ద్వారా పంపుతారు. మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలలో ఏదైనా లావాదేవీ జరగకపోతే సీఏఎస్ హోల్డింగ్ వివరాలతో కూడిన అర్ధ వార్షిక ప్రాతిపదికన ఈ-మెయిల్ ద్వారా పెట్టుబడిదారులకు పంపుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..