Google Pay: గూగుల్‌ పే యూజర్లకు షాక్‌.. ఇకపై రీచార్జ్‌లపై అదనపు చార్జీల వసూలు

గత కొంత కాలంగా ఈ యాప్స్‌లో యూపీఐను ఉపయోగించి చెల్లించే బిల్లులకు కొన్ని చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ చార్జీలు వసూలు చేయడంలో పేటీఎం ముందు ఉంది. అయితే తాజాగా గూగుల్‌ పే కూడా యూపీఐను ఉపయోగించి చేసే చెల్లింపులపై చార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్‌ పే యాప్‌ను ఉపయోగించి తమ మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేయాలనుకునే వినియోగదారులు ఇప్పుడు మూడు రూపాయలు చార్జీ కట్టాల్సి ఉంటుంది.

Google Pay: గూగుల్‌ పే యూజర్లకు షాక్‌.. ఇకపై రీచార్జ్‌లపై అదనపు చార్జీల వసూలు
g pay
Follow us
Srinu

| Edited By: TV9 Telugu

Updated on: Nov 25, 2023 | 7:30 PM

భారతదేశంలో 2016లో చేసిన నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ లాంచ్‌ చేసిన యూపీఐ చెల్లింపుల ద్వారా ఎక్కువ మంది లావాదేవీలు చేస్తున్నారు. యూపీఐ సర్వీసుల లాంచ్‌తో వివిధ యాప్‌లను ఉపయోగించి లావాదేవీలు చేస్తున్నారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యాప్‌లు యూపీఐను ఉపయోగించి చేసే చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈ యాప్స్‌లో యూపీఐను ఉపయోగించి చెల్లించే బిల్లులకు కొన్ని చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ చార్జీలు వసూలు చేయడంలో పేటీఎం ముందు ఉంది. అయితే తాజాగా గూగుల్‌ పే కూడా యూపీఐను ఉపయోగించి చేసే చెల్లింపులపై చార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్‌ పే యాప్‌ను ఉపయోగించి తమ మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేయాలనుకునే వినియోగదారులు ఇప్పుడు మూడు రూపాయలు చార్జీ కట్టాల్సి ఉంటుంది. గూగుల్‌ పే తాజా చార్జీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గూగుల్‌ పే ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేసినప్పుడు ఈ రుసుము వర్తిస్తుంది. గూగుల్‌ పే తీసుకున్న ఈ నిర్ణయం ఫోన్‌ పే, పేటీఎం వంటి సంస్థల దారిలోనే గూగుల్‌ పే వెళ్తుందని అర్థం అవతుంది. అయితే గూగుల్‌ పేలో ఈ చార్జీలు వసూలు చేస్తున్నా ఈ రుసుము గురించి గూగుల్‌ అధికారికంగా ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇటీవల ఓ వినియోగదారుడు రూ.749 జియో రీచార్జ్‌ చేసినప్పుడు ఈ అదనపు చెల్లింపును గమనించారు. అయితే గూగుల్‌ రూ.100 లోపు రీచార్జ్‌లపై ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు.రూ.100 నుంచిరూ. 300 లోపు రీచార్జ్‌లను రూ.2, రూ.300 కంటే ఎక్కువ రీచార్జ్‌లపై రూ.3 చార్జీలను వసూలు చేస్తుంది. 

గూగుల్‌ ఇటీవల భారతీయ వినియోగదారుల కోసం తన సేవా నిబంధనలను నవీకరించింది. అయితే ఈ జోడింపు నవంబర్ 10 నవీకరణలో భాగమా? అనేది అస్పష్టంగానే ఉంది. లావాదేవీని పూర్తి చేయడానికి ముందు వర్తించే ఫీజుల గురించి వినియోగదారులకు తెలియజేయజేస్తామని నిబంధనలు పేర్కొంటున్నాయి. కంపెనీ ఇష్టానుసారం ఫీజులను నిర్ణయించవచ్చని నిబంధనలు కూడా పేర్కొన్నాయి. అయితే వినియోగదారులు రీచార్జ్‌ను ఆయా కంపెనీ యాప్‌ల నుంచి గూగుల్‌ పే ద్వారా చేస్తే మాత్రం అదనపు చార్జీలు వర్తించడం లేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..