Akshaya Trutiya 2022: అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభమని.. లక్ష్మీదేవి(lakshmi devi) అనుగ్రహం తమపై ఎల్లవేళలా ఉంటుందని నమ్మకం. దీంతో నేడు సామాన్యుల నుంచి ఉన్నత స్తాయిలో ఉన్నవారు కూడా తమ స్టేజ్ కు తగినట్లు బంగారం కొనుగోలు చేస్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో భారీగా బంగారం కొనుగోళ్ళు పెరిగాయి. కరోనా తరువాత షాపింగ్ స్వేఛ్ఛతో పసిడి కొనుగోళ్ళు పెరిగాయి. అయితే ప్రజల అక్షయ తృతీయ సెంటిమెంట్ ను బంగారం షాప్స్ యాజమాన్యం క్యాష్ చేసుకుంటున్నాయి. దీంతో తనిఖీ అధికారులు రంగంలోకి దిగి.. అక్షయ తృతీయ రోజూ బంగారం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. తూకంలో మోసాలు అన్న సమాచారం అందుకున్న తూనికలు కొలతల అధికారుల దాడులు తనికీలు నిర్వహించారు. వన్ ఎంజీ తూకం పై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బంగారం వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు రాళ్ల ఉన్న బంగారం వస్తువులు కొనుగోలు చేసే విషయంలో తస్మాత్ జాగ్రత్త అని అధికారులు హెచ్చరిస్తున్నారు. తూనికలు కొలతల సర్టిఫికేట్ లేకపోతే నేరమేనని గోల్డ్ షాప్స్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.
నాణ్యత పరీక్ష: బంగారం ఆభరణాలకు రిజిస్ట్రేషన్ ముద్ర, బీఐఎస్ హాల్ మార్క్ ను భారతీయ ప్రమాణాల సంస్థ అందిస్తోంది. ఐఎస్ఐ ముద్రతో పాటు ప్రతి తయారీదారు లైసెన్స్ ను అందిస్తోంది. వస్తువులు కొనుగోలు చేసే వారు వీటన్నింటిని పరీక్షించుకునే విధంగా అమల్లోకి తీసుకొచ్చింది.
హాల్ మార్క్: గత ఏడాది జూన్ 23 నుంచి బంగారం నగలపై హాల్ మార్క్ ను కేంద్ర ప్రభుత్వం తప్పని సరి చేసింది. వినియోగదారులకు స్వచ్ఛమైన బంగారం అందించేందుకు ఇది తప్పని సరి చేసింది.
పసిడి వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మార్కెట్ లో ఎక్కువగా 22 క్యారెక్టల బంగారం వస్తువులనే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసే వస్తువుల మీద బీఐఎస్ ముద్ర, ఆ బంగారం నాణ్యత, హెచ్ యూ ఐడీ నెంబర్ ఇవి ఉన్నాయో లేవో చూసుకోవాల్సి ఉంది.
బంగారం వస్తువు నాణ్యత ఎలా తెలుసుకోవచ్చంటే..
గోల్డ్ వస్తువులు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా హాల్ మార్క్ ఉన్న వస్తువులను ఎంపిక చేసుకోవాలి. బంగారం నాణ్యత తెలుసుకోవాలంటే.. బీఐఎస్ కేర్ యాప్ ను ఉపయోగించి నాణ్యత గుర్తించవచ్చు. లేదా అందుబాటులో ఉన్న హాల్ మార్క్ కేంద్ర ల వద్దరూ. 45 లను చెప్పించి కొనడానికి ముందు వస్తువు నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని బంగారం కొనుగోలు చేయడంలో ఏమరుపాటు లేకుండా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Akshaya Tritiya: ఈ అక్షయ తృతీయపై భారీ ఆశలు.. 20 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగే ఛాన్స్
Viral Video: వేగంగా దూసుకొస్తున్న కారు..ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం..వైరల్ ..వీడియో