Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌ రోజూ 2జీబీ డేటాతో పలు రకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్‌

|

May 15, 2021 | 6:06 AM

Airtel 2GB Plans: మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? రోజూ ఎక్కువ డేటా ఉపయోగిస్తారా? అయితే మీకు రోజూ 2జీబీ డేటా అందించే ప్లాన్స్ కావాలి. టెలికామ్ సంస్థలు రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ,..

Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌ రోజూ 2జీబీ డేటాతో పలు రకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్‌
Airtel
Follow us on

Airtel 2GB Plans: మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? రోజూ ఎక్కువ డేటా ఉపయోగిస్తారా? అయితే మీకు రోజూ 2జీబీ డేటా అందించే ప్లాన్స్ కావాలి. టెలికామ్ సంస్థలు రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 3జీబీ డేటా అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌లో కూడా ఇలాంటి ప్లాన్స్‌ ఉన్నాయి. అయితే డేటా పెద్దగా ఉపయోగించుకోలేని వారికి రోజు 1 జీబీ సరిపోతుంది. కాస్త ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి రోజూ 1.5జీబీ కావాలి. ఇక స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు, సినిమాలు ఎక్కువగా చూసేవారికి అంతకన్నా ఎక్కువ డేటా కావాలి. కనీసం రోజూ 2జీబీ డేటా అవసరం. మరి ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఏవి ఉన్నాయో, ఆ ప్లాన్స్‌తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.

Airtel Rs 298 ప్లాన్‌:

ఎయిర్‌టెల్‌లో రూ.298 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌. వ్యాలిడిటీ 28 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు.

Rs 449 ప్లాన్‌:

ఎయిర్‌టెల్‌లో రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌. వ్యాలిడిటీ 56 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Rs 599 ప్లాన్‌:

ఎయిర్‌టెల్‌లో రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, వ్యాలిడిటీ 56 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అంతేకాదు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

Rs 698 ప్లాన్:

ఎయిర్‌టెల్‌లో రూ.698 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌. 84 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Rs 2498 ప్లాన్‌:

ఎయిర్‌టెల్‌లో రూ.2498 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌. వ్యాలిడిటీ 365 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Rs 2698 ప్లాన్‌:

ఎయిర్‌టెల్‌లో రూ.2648 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌. వ్యాలిడిటీ 365 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా..? అయితే ఇలా తెలుసుకోండి..!

LIC Customers: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. కరోనా పరిస్థితుల్లో కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం

Akshaya Tritiya 2021: 1925 నుంచి 2021 వరకు పుత్తడి ప్రస్థానం.. అప్పుడు రూ.18 ఉన్న బంగారం.. ఇప్పుడు 49 వేలు