Agriculture News: సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం.. 50 వేల రూపాయల ఆర్థిక సాయం..!

|

Mar 30, 2022 | 4:08 PM

Agriculture News: వ్యవసాయంలో ఎరువుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయాన్ని

Agriculture News: సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం.. 50 వేల రూపాయల ఆర్థిక సాయం..!
Organic Farming
Follow us on

Agriculture News: వ్యవసాయంలో ఎరువుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం రెండు పథకాలను అమలు చేస్తుంది. మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఈ విధంగా చెప్పారు. క్లస్టర్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పిఓ) ద్వారా కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి రెండు పథకాలను ప్రారంభించిందని అన్నారు. ఇందులో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY), ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఉన్నాయి. ఈ రెండు పథకాలు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మొక్కల పెంపకం, పంటకోత, మార్కెటింగ్, నిర్వహణలో సహాయపడతాయని వివరించారు.

హెక్టారుకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకం కింద 3 సంవత్సరాల పాటు రైతులకు హెక్టారుకు రూ.50,000 ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఇందులో హెక్టారుకు రూ.31 వేలు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఇది కాకుండా మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ కింద ఎఫ్‌పీఓల తయారీ, నాణ్యమైన విత్తనాలు, శిక్షణ తదితరాల కోసం హెక్టారుకు రూ.46,575 చొప్పున 3 ఏళ్లపాటు ఇస్తారు.

సేంద్రీయ ఉత్పత్తుల కోసం పోర్టల్

మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌పై కేంద్ర ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోందన్నారు. దీని కింద ప్రభుత్వం ఒక పోర్టల్‌ను కూడా రూపొందించిందన్నారు. ఇందులో 5.73 లక్షల మంది రైతులు తమ పేర్లని నమోదు చేసుకున్నారు. ఇందులో వీరు తమ సేంద్రియ ఉత్పత్తుల వివరాలను అప్‌లోడ్ చేస్తారు.

సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 6 రెట్లు పెరిగాయి

మంత్రి కైలాష్ చౌదరి సమాచారం ఇస్తూ సేంద్రియ వ్యవసాయంలో భారతదేశం బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతుందని అన్నారు. 2013లో దేశం నుంచి 1.77 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు ఎగుమతి కాగా ప్రస్తుతం 8.88 మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ విధంగా 6 రెట్లు పెరిగిందని తెలిపారు.

Health Tips: గర్భిణులు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతారు.. కారణం ఏంటంటే..?

Health Tips: పెళ్లయిన మగవారు కచ్చితంగా ఈ 3 ఆహారాలు తినాలి.. అప్పుడే పూర్తి ఫిట్‌గా ఉంటారు..!

Ostrich Facts: ప్రపంచంలో వేగంగా పరుగెత్తగల పక్షి.. దీని గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!