Agricultural Success Story: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తూ.. దోస సాగుతో అధిక ఆదాయం

|

Sep 12, 2023 | 10:02 PM

తన భూమిలో నాలుగు నెట్‌ హౌస్‌లు నిర్మించుకున్నానని, అందులో దోసకాయలు సాగు చేస్తున్నానని ముఖేష్‌ తెలిపాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి కాలంలో దోసకాయకు డిమాండ్ పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో 2 ఏళ్లుగా నెట్ హౌస్ లో దోసకాయలు సాగు చేస్తున్నాడు. దీంతో ముఖేష్‌కు మంచి లాభాలు వస్తున్నాయి. అతను క్రమంగా వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచడానికి ఇదే కారణం. విశేషమేమిటంటే ముఖేష్..

Agricultural Success Story: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం  చేస్తూ.. దోస సాగుతో అధిక ఆదాయం
Cucumber Farming
Follow us on

ప్రతి తల్లితండ్రులు తమ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుంటారు. తద్వారా వారు జీవితాంతం దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అది ప్యూన్ ప్రభుత్వ ఉద్యోగమే అయినా సరే. అయితే ఈరోజు మనం మంచి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఇప్పుడు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం.

నిజానికి మనం చెప్పుకోబోయే యువ రైతు పేరు ముఖేష్ కుమార్. ముఖేష్ హర్యానాలోని కర్నాల్ జిల్లా నివాసి. అంతకుముందు హర్యానా బోర్డులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతినెలా రూ.45 వేలు జీతం వచ్చేది. కానీ అతనికి ఈ ప్రభుత్వ పని చేయడం ఇష్టం లేకపోవడంతో ఈ ఉద్యోగం మానేశాడు. ఈరోజు అతను తన పూర్వీకుల భూమిలో నెట్ హౌస్ వ్యవసాయం చేస్తున్నాడు. దాని నుంచి అతను మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు.

తన భూమిలో నాలుగు నెట్‌ హౌస్‌లు నిర్మించుకున్నానని, అందులో దోసకాయలు సాగు చేస్తున్నానని ముఖేష్‌ తెలిపాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి కాలంలో దోసకాయకు డిమాండ్ పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో 2 ఏళ్లుగా నెట్ హౌస్ లో దోసకాయలు సాగు చేస్తున్నాడు. దీంతో ముఖేష్‌కు మంచి లాభాలు వస్తున్నాయి. అతను క్రమంగా వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచడానికి ఇదే కారణం. విశేషమేమిటంటే ముఖేష్ తన నెట్ హౌస్ లో చాలా మందికి ఉపాధి కూడా కల్పించాడు.

ఇవి కూడా చదవండి

దోసకాయలు కిలో రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు

నెట్‌హౌస్‌లో వ్యవసాయం చేయడం వల్ల ఎక్కువ నీరు ఆదా అవుతుందని రైతు ముఖేష్ కుమార్ చెప్పారు. ఎందుకంటే నెట్ హౌస్‌లో డ్రిప్ పద్ధతిలో పంటలకు సాగునీరు అందిస్తారు. దీంతో నీటి వృథా తగ్గుతుంది. అలాగే మొక్కల వేర్లలోకి నీరు చేరుతుంది. ముఖేష్ కుమార్ తన పొలంలో ఉత్పత్తి చేసిన దోసకాయలను ఢిల్లీ, చండీగఢ్ సహా అనేక నగరాలకు సరఫరా చేస్తున్నాడు. ప్రస్తుతం కరక్కాయలు కిలో రూ.15 చొప్పున విక్రయిస్తున్నాడు.

ఏడాది పొడవునా సాగు..

నెట్ హౌస్ కట్టడానికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని ముఖేష్ చెబుతున్నాడు. కానీ దానిలోపల వ్యవసాయం చేస్తే ఆదాయం బాగా పెరుగుతుంది. దోసకాయలో చాలా రకాలు ఉన్నాయని, నెట్ హౌస్ లోపల ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చని యువ రైతు చెబుతున్నాడు. ఈ రైతు ఇలా ప్రభుత్వ ఉద్యోగం మానేసి ఇప్పుడు వ్యవసాయంపైనే దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగంతో వచ్చే జీతానికంటే ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నాడు. వ్యవసాయం అంటే దండగా అనే వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయంలో ఎలాంటి మజా ఉంటుందో తెలియజేస్తున్నాడు. ఉద్యోగం కంటే వ్యవసాయంలో ఉండే సంతోషం వేరేగా ఉంటుందని రైతు చెప్పుకొస్తున్నాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి