Vodafone Idea: వోడాఫోన్-ఐడియా షేర్ల దూకుడు.. రీజన్ ఆదేనా.?దీని వెనుక అమెజాన్ ఉందా.?

|

May 30, 2022 | 4:06 PM

Vodafone Idea: టెలికాం రంగంలో అతిపెద్ద విలీనంగా భావించిన వొడాఫోన్‌, ఐడియాలు విలీనం తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాననే చెప్పాలి. చాలా కాలం పాటు వీటి షేర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడమే దీనికి కారణంగా...

Vodafone Idea: వోడాఫోన్-ఐడియా షేర్ల దూకుడు.. రీజన్ ఆదేనా.?దీని వెనుక అమెజాన్ ఉందా.?
Vodafone Idea
Follow us on

Vodafone Idea: టెలికాం రంగంలో అతిపెద్ద విలీనంగా భావించిన వొడాఫోన్‌, ఐడియాలు విలీనం తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాననే చెప్పాలి. చాలా కాలం పాటు వీటి షేర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న వొడాఫోన్‌-ఐడియా షేర్ల ధరలు సోమవారం ఒక్కసారిగా ఎగబాకాయి. షేర్‌ విలువ ఒక్కసారి 5 శాతం పెరిగింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు వొడాఫోన్‌ ఐడియాల షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కేవలం రెండు గంటల వ్యవధిలో 223.91 లక్షల షేర్లు అమ్ముడు కావడం విశేషం. రూ. 20.46 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ క్యాపిటల్‌ రూ. 29,934 కోట్లుగా ఉంది.

ఇదిలా ఉంటే వొడాఫోన్‌ ఐడియా గతకొన్ని రోజులుగా పెట్టుబడి దారుల కోసం అన్వేషిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉన్న రుణాలు తీర్చుకోవడంలో నిమగ్నమైందీ టెలికాం సంస్థ. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా షేర్‌ విలువ పెరగడంపై ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇంతకీ విషయమేంటంటే ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ రానున్న రోజుల్లో వొడాఫోన్‌ ఐడియాలో భారీగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే షేర్‌ విలువ పెరిగిందనే వాదన వినిపిస్తోంది.

ఓ అంచనా ప్రకారం అమెజాన్‌ ఏకంగా రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే వొడాఫోన్‌ఐడియా షేర్‌ విలువ 50 పైసలు పెరిగింది. అయితే పెరిగింది తక్కువే అయినప్పటికీ ఇతర ఇన్వెస్టర్లకు వొడాఫోన్‌ ఐడియాపై భరోసా పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..