Swiggy Controversy: నెట్టింట ‘హిందూ ఫోబిక్ స్విగ్గీ’ యాష్‌టాగ్ ట్రెండ్.. డెలివరీ సంస్థపై నెటిజన్ల ఆగ్రహం.. కారణం ఏమిటంటే..?

|

Mar 08, 2023 | 7:11 PM

స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వివాదానికి దారి తీయడమే కాక.. అటు సామన్యులు, ఇటు నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతున్నారు. అంతేకాక..

Swiggy Controversy: నెట్టింట ‘హిందూ ఫోబిక్ స్విగ్గీ’ యాష్‌టాగ్ ట్రెండ్.. డెలివరీ సంస్థపై నెటిజన్ల ఆగ్రహం.. కారణం ఏమిటంటే..?
Swiggy Controversial Bill Board
Follow us on

ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కారణంగా ఏ విషయం అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఆ నేపథ్యంలోనే కమర్షియల్ కంపెనీలు కూడా తమ ప్రకటనలను సోషల్ మీడియా ద్వారానే చేపడుతున్నాయి. అయితే ప్రస్తుతం స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వైరల్ అవుతుంది. లేదు లేదు నిజానికి ఆ ప్రకటన వివాదంగా మారిందని చెప్పుకోవడమే సరైన పదం అవుతుంది. అవును ఇటీవల స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వివాదానికి దారి తీయడమే కాక.. అటు సామన్యులు, ఇటు నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతున్నారు. అంతేకాక #HinduPhobicSwiggy అనే యాష్‌టాగ్‌ను ట్రెండ్ చేస్తూ స్విగ్గీపై ఆగ్రహం వ్యక్తం చుస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్విగ్గీ ఏర్పాటు చేసిన వివాదాస్పద బిల్‌బోర్డ్ ప్రకటనపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. అంతేకాక నెటిజన్లు మండిపడుతున్నారు. హోలీ రోజున ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. స్విగ్గీ పెట్టిన బిల్‌బోర్డ్‌లో రెండు గుడ్లు ఉన్నాయి. ఇంకా దాని పక్కన ‘ఆమ్లెట్; సన్నీ సైడ్-అప్; కిసీ కే సర్ పర్. #BuraMatKhelo. ఇన్‌స్టామార్ట్‌లో హోలీ సరుకులు పొందండి’ అని రాసి ఉంది. ఈ ప్రకటనతోనే అసలు వివాదం మొదలైంది. నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతూ.. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా హోలీని జరుపుకుంటారని, అందుకు స్విగ్గీ అనుమతి అవసరం లేదన్నారు. ఒక నెటిజన్ స్విగ్గీని ట్యాగ్ చేసి ‘ఈద్ సందర్భంగా ముస్లింలు మేకలను వధించడం మానుకోవాలని లేదా క్రిస్మస్ సందర్భంగా చెట్లను నరకవద్దని క్రైస్తవులను కోరుతూ మీరు అదే బిల్‌బోర్డ్‌ను పెట్టగలరా..? మీ హిందూ ఫోబియాను మా పండుగల నుంచి దూరంగా ఉంచండి, హిందువులు కోరుకున్న విధంగా హోలీని జరుపుకుందాంవ’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి