AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola S1X: చవకైన ధరలో ఊరిస్తున్న ఓలా.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత బావుందో చూశారా?

బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా నుంచి వచ్చిన ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ ను ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఆవిష్కరించారు. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితం భవిష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ పై కూర్చొని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి.

Ola S1X: చవకైన ధరలో ఊరిస్తున్న ఓలా.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత బావుందో చూశారా?
Ola S1x
Follow us
Madhu

|

Updated on: Sep 07, 2023 | 3:43 PM

ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అత్యాధునిక సాంకేతికతను స్కూటర్లలో మిక్స్ చేస్తూ వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను తీసుకొస్తుండటంతో వీటిని మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే అత్యంత చవకైన సరికొత్త ఓలా స్కూటర్ ను ఇటీవల లాంచ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా నుంచి వచ్చిన ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ ను ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఆవిష్కరించారు. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితం భవిష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ పై కూర్చొని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. దానికి ఆయన ఒక్కరే స్కూటర్ పై దిగిన ఫొటో కాగా, మరొకటి తన బృందం కలిసి దిగిన ఫొటో కావడం విశేషం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఓలా కొత్త స్కూటర్ ఎస్1ఎక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మూడు వేరియంట్లలో..

ఓలా ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న ఈ కొత్త చవకైన స్కూటర్ ఓలా ఎస్1ఎక్స్ మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 79,999కాగా ప్రస్తుతం దీన ధర రూ. 89,999గా ఉంది. 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఎస్1ఎక్స్ వస్తున్న వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 89,999కాగా, ఇప్పుడు రూ.99,999గా ఉంది. అది విధంగా ఎస్1ఎక్స్ ప్లస్ మోడల్ ధర ప్రారంభంలో రూ.99,999కాగా, ఇప్పుడు దాని ధర రూ. 1,09,999గా ఉంది.

డిజైన్ అండ్ లుక్..

ఈ ఓలా ఎస్1ఎక్స్ డిజైన్ పాత ఓలా స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది. ఓలా ఎస్1 లైన్ అప్ లో వస్తున్న అత్యంత చవకైన ఈ మోడల్లో ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, పెద్ద హెడ్ లైట్ కౌల్, సింగిల్ పీస్ సీట్, వంతు తిరిగిన బాడీ ఉంటుంది. అలాగే పాత మోడల్ లాగే ముందు ట్విన్ ఫోర్క్ సస్పెన్షన్ ఉంటుంది. వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జర్బర్ ఉంటుంది. స్టీల్ చక్రాలు ఉంటాయి.

ఓలా ఎస్1ఎక్స్ స్పెసిఫికేషన్లు..

  • ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. మొదటి వేరియంట్ 2కేడబ్ల్యూ సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 2.7కిలోవాట్ల మోటార్ ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. సింగిల్ చార్జ్ పై ఎకో మోడ్లో 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 350వాట్ల సామర్థ్యంతో చార్జ్ ఇస్తారు. దీనిలో 3.5 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, ఫిజికల్ కీ ఉంటుంది.
  • రెండో వేరియంట్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీనిలో కూడా 2.7కిలోవాట్ల మోటార్ ఉంటుంది. మిడ్ స్పెక్ రేంజ్ మోడల్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జ్ పై ఎకో మోడ్లో 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో కూడా 3.5 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, ఫిజికల్ కీ ఉంటుంది.
  • చివరి వేరియంట్ ఎస్1ఎక్స్ ప్లస్ స్కూటర్ లో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 2.7 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. ఇది గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జ్ పై 125కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. దీనిలో అత్యాధునిక ఫీచర్లైన ఓటీఏ అప్ డేట్స్, మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ బూట్ లాక్/అన్ లాక్, బ్లూటూత్/జీపీఎస్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, ప్రెడెక్టివ్ మెయింటేనెన్స్, ఓలా కంట్రోల్ యాప్ వంటివి ఉంటాయి. ఈ ఫీచర్లన్నీ మొదటి రెండు వెర్షన్లలో ఉండవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..