Adani Group: టాటా గ్రూప్‌ను అధిగమించిన అదానీ.. నెలకు రూ. 56,700 కోట్ల ఆదాయం..

అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార సమూహంగా మారింది. 154 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని సాధించింది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ. 20.74 లక్షల కోట్లకు అంటే దాదాపు 260 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Adani Group: టాటా గ్రూప్‌ను అధిగమించిన అదానీ.. నెలకు రూ. 56,700 కోట్ల ఆదాయం..
Follow us

|

Updated on: Sep 17, 2022 | 3:20 PM

Adani Group: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార గ్రూపుగా అవతరించింది. ఈ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ. 20.74 లక్షల కోట్లకు అంటే దాదాపు 260 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 154 ఏళ్ల టాటా గ్రూప్‌ను ఓడించి అదానీ గ్రూప్ ఈ స్థానాన్ని సాధించింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.20.7 లక్షల కోట్లకు చేరింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.17.1 లక్షల కోట్లుగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రాకెట్ వేగంతో దూసుకపోతోంది. దీంతో గౌతమ్ అదానీ కూడా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రస్తుతం అదానీ పక్కన టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మాత్రమే మిగిలి ఉన్నాడు.

మూడేళ్లలోపే ఏడు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు రూ.18.7 లక్షల కోట్లు అంటే దాదాపు 234 బిలియన్ డాలర్లు పెట్టుబడిదారుల సంపదకు చేరాయి. 2019 చివరి నాటికి ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.2 లక్షల కోట్లకు చేరింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్ ప్రతి నెలా సగటున 56,700 కోట్ల రూపాయలను వాటాదారులకు జోడించింది. ఈ కాలంలో టాటా గ్రూప్ రూ.9 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.7.4 లక్షల కోట్లు జోడించాయి.

1988లో ప్రారంభమైన అదానీ గ్రూప్..

ఇవి కూడా చదవండి

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను 1988లో అదానీ ప్రారంభించారు. అప్పుడు దాని పేరు అదానీ ఎక్స్‌పోర్ట్స్. అతను కమోడిటీస్ ట్రేడింగ్ వ్యాపారంతో ప్రారంభించాడు. అలాగే ఎగుమతి-దిగుమతి కోసం ముంద్రా పోర్టును స్థాపించాడు. గత రెండు దశాబ్దాలలో, ఈ సమూహం అనేక వ్యాపారాలలోకి ప్రవేశించింది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు, కొనుగోళ్లు, జాయింట్ వెంచర్‌ల ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. అదానీ గ్రూప్ థర్మల్, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. అనేక పోర్టులను కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రసార మార్గాలను నెట్‌వర్క్ చేసింది. దేశంలోని రెండు అతిపెద్ద సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసింది. అనంతరం అదానీ గ్రూప్ వ్యాపారం ట్రేడింగ్, సహజ వాయువు, విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలలో విస్తరించింది.

ఆస్ట్రేలియాలో బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించినందుకు అదానీ గ్రూప్ చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు పెడతామని కంపెనీ హామీ ఇచ్చింది. అదానీ గ్రూప్ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని అనేక ప్రముఖ పెట్టుబడిదారులు దానిపై ఆసక్తిని కనబరిచారు. వీటిలో వార్‌బర్గ్ పింకస్, టోటల్ ఎనర్జీలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో, సింగపూర్ ఆధారిత కంపెనీ విల్మార్ ఇంటర్నేషనల్‌తో కలిసి అదానీ గ్రూప్ అదానీ విల్‌మార్‌ను ఏర్పాటు చేసింది. నేడు దేశంలోనే అగ్రగామి FMCG కంపెనీగా మారింది. మూడేళ్ల క్రితం, కంపెనీ విమానాశ్రయాల నిర్వహణ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది.

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!