Aadhaar Updates: ఆధార్ కార్డు అప్‌డేట్‌కు ఎంత రుసుము ఉంటుంది.. పూర్తి వివరాలు

|

Oct 23, 2022 | 12:57 PM

ఆధార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం మీరు కొంత రుసుము చెల్లించాలి. ఈ రుసుము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ముందుగా..

Aadhaar Updates: ఆధార్ కార్డు అప్‌డేట్‌కు ఎంత రుసుము ఉంటుంది.. పూర్తి వివరాలు
Aadhaar Card
Follow us on

ఆధార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం మీరు కొంత రుసుము చెల్లించాలి. ఈ రుసుము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ముందుగా నిర్ణయించబడుతుంది . మీరు ఈ ఛార్జీల గురించి తెలుసుకోవాలి. తద్వారా మీరు తదుపరిసారి అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు, మీరు మోసానికి గురికాకుండా ఉండాలి. అప్‌డేట్ రుసుము భిన్నంగా ఉందని, కేంద్రం ఇంకేదో వసూలు చేస్తుందని తరచుగా ఇటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ. అందుకే ఆలస్యం చేయకుండా ఆధార్ అప్‌డేట్ కోసం ఛార్జీల గురించి తెలుసుకుందాం.

☛ ఆధార్ సంఖ్య జనరేషన్ (0-5 సంవత్సరాలు) ఉచితంగా

☛ ఆధార్‌ సంఖ్యను అప్‌డేట్‌ చేసుకునేందుకు ( 5 ఏళ్లు పైబడినవారికి)- ఎలాంటి రుసుము ఉండదు. పూర్తిగా ఉచితం.

ఇవి కూడా చదవండి

☛ తప్పనిసరి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ – ఎలాంటి రుసుము ఉండదు. పూర్తిగా ఉచితం.

☛ ఇతర బయోమెట్రిక్‌ అప్‌డేట్స్‌ (డెమోగ్రాఫి అప్‌డేట్స్‌) – రూ.100

☛ జనాభా నవీకరణ – రూ.50

☛ గుర్తింపు రుజువు లేదా నివాస రుజువులో అప్‌డేట్‌ కోసం – రూ.50

☛ ఇ-కేవైసీ కోసం ఆధార్‌ లింక్‌ చేయడం – రూ.30

☛ మై ఆధార్‌ పోర్టల్‌ నుంచి గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయడం – రూ.25

పిల్లల ఆధార్

పిల్లల ఆధార్ కార్డును బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అతని ఆధార్‌ను రూపొందించడానికి బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. పిల్లల ఆధార్ UID జనాభా సమాచారం, తల్లిదండ్రుల ముఖ ఛాయాచిత్రం ఆధారంగా రూపొందించబడుతుంది. అంటే పిల్లల ఆధార్‌లో తల్లిదండ్రుల వివరాలను అనుసంధానం చేస్తారు. పిల్లవాడు 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు అతని చేతుల వేళ్లు, ఐరిస్, ముఖ ఛాయాచిత్రాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఈ వివరాలు ఒరిజినల్ ఆధార్ లెటర్‌లో అప్‌డేట్ చేయబడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి