AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలా..? జీవితకాలంలో మొత్తం ఎన్నిసార్లు మార్చకోవచ్చంటే..?

ఆధార్ కార్డులో అన్నీ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కేవైసీ ధృవీకరణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని వివరాలు ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఈ మేరకు యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది.

Aadhaar Card: ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలా..? జీవితకాలంలో మొత్తం ఎన్నిసార్లు మార్చకోవచ్చంటే..?
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Sep 07, 2026 | 1:07 PM

Share

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాల దరఖాస్తు నుంచి ప్రైవేట్ హోటల్ రూమ్స్‌లో ప్రవేశం వరకు ఎక్కడైనా సరే.. ముందుగా దీనినే అడుగుతారు. ఇది అందించకుండా ఎలాంటి సేవలు మీరు పొందలేరు. ఆధార్ కార్డుకు అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే.. నిరంతరం మన జేబుల్లో ఉంచుకోవాల్సి వస్తోంది. అయితే ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆధార్ కార్డులో ఒకలా.. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, ఇతర ధృవీకరణ పత్రాల్లో మరోలా ఉన్నా అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కేవైసీ వెరిఫికేషన్ సమయంలో సమస్యలు రావొచ్చు. దీంతో ఈ గుర్తింపు ధృవీకరణ పత్రంలో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే మార్చుకునే అవాకశం యూఐడీఏఐ కల్పిస్తోంది. ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. జీవితకాలంలో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? యూఐడీఏఐ నిబంధనలు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కేవలం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఆధార్ కార్డు జారీ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తప్పుగా ఉంటే ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా వివరాలు తప్పుగా ఉంటే రెండోసారి మార్చుకోవడానికి అనేక కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. తొలిసారి అప్డేట్ చేసేటప్పుడు మీరు బర్త్ సర్టిఫికేట్ కాకుండా వేరే గుర్తింపు ధృవీకరణ పత్రం ఇచ్చి ఉంటే.. రెండోసారి అప్డేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌తో పాటు అఫిడవిట్ సమర్పించాలి. రెండోసారి అప్డేట్ చేసేటప్పుడు మీరు సరైన డాక్యుమెంట్స్ సమర్పించి ఆపరేటర్ తప్పిదం వల్ల తప్పుగా ముద్రిస్తే మరోసారి మార్చుకోవచ్చు. గతంలో సమర్పించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే సులభంగా మార్చుకోవచ్చు. ఒకవేళ అది లేకపోతే మీరు సెల్ప్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

తప్పుడు పత్రాలు సమర్పిస్తే..

ఒకవేళ మీరు తప్పుడు పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. మీ ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సమర్పించి బయోమెట్రిక్ వెరిఫై చేసుకోవాలి. అనంతరం బర్త్ సర్టిఫికేట్, అఫిడవిట్ సమర్పిస్తే ఆధార్‌ను యాక్టివేట్ చేస్తారు.మీరు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయించుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us