AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి పుట్టిన పిల్లలకు జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్‌ కార్డు..

నవజాత శిశువుల జనన ధృవీకరణ పత్రాలతో పాటు 'ఆధార్' నంబర్ నమోదు చేసే సదుపాయం వచ్చే కొన్ని నెలల్లో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి ..

Aadhaar Update: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి పుట్టిన పిల్లలకు జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్‌ కార్డు..
Aadhaar Updates
Subhash Goud
|

Updated on: Nov 11, 2022 | 8:04 AM

Share

నవజాత శిశువుల జనన ధృవీకరణ పత్రాలతో పాటు ‘ఆధార్’ నంబర్ నమోదు చేసే సదుపాయం వచ్చే కొన్ని నెలల్లో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో బిడ్డకు జనన ధృవీకరణ పత్రంతోపాటు ఆధార్ నంబర్‌ను కూడా జారీ చేయడం జరుగుతుంది. దీంతో ఆధార్‌ను తర్వాత తయారు చేసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆధార్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో నవజాత శిశువుల ఆధార్ నమోదు సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్రక్రియ ఏడాది క్రితమే ప్రారంభమై, క్రమంగా అనేక రాష్ట్రాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటి వరకు బిడ్డ పుట్టినప్పుడు జనన ధృవీకరణ పత్రాన్ని తయారు చేసి, ఆ తర్వాత ఆధార్‌ను తయారు చేసేవారు. ఇది ఒక రకమైన డబుల్ పని అవుతుంది. దీని వల్ల సమయం వృధా అవుతుంది. కానీ ఇప్పుడు రెండు పనులు ఒకేసారి జరిగిపోతాయి. దీంతో తర్వాత ఆధార్‌ కోసం సమంయ వెచ్చించాల్సిన అవసరం ఉండదు.

రాబోయే కొద్ది నెలల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంచనా వేస్తోంది. ఈ సదుపాయం ఎవరి ఇంట్లోనైనా బిడ్డ జన్మించినట్లయితే జనన ధృవీకరణ పత్రంలో పాటు ఆధార్‌ కూడా అందించడం సులభతరం అవుతుంది. అయితే ఐదేళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారం తీసుకోరు. పిల్లలకి ఐదు, 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ సమాచారం నవీకరించబడుతుంది. వారి తల్లిదండ్రుల ఆధారంగానే వారికి ఈ ఆధార్‌ ను కేటాయిస్తారు. పిల్లలు పెద్దయ్యాక వేలిముద్రలు తీసుకుని కార్డును అప్‌డేట్‌ చేస్తారు.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం.. జనన ధృవీకరణ పత్రంతో పాటు పిల్లల ఆధార్ జారీ చేయబడిందని, దీని కోసం యూఐడీఏఐ నిరంతరం పనిచేస్తుందని నిర్ధారించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రక్రియకు కంప్యూటర్ ఆధారిత జనన నమోదు వ్యవస్థ అవసరమని, అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ఈ సదుపాయం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చాలా రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పని సాగుతుండగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

జనన ధృవీకరణ పత్రంతో ఆధార్ నంబర్ ఇచ్చే సదుపాయం కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు 16 రాష్ట్రాలు చేర్చబడ్డాయి. అయితే ఇప్పుడు క్రమంగా అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తున్నారు. ఇప్పటివరకు, ఈ 16 రాష్ట్రాల్లో జనన ధృవీకరణ పత్రం జారీ చేసినప్పుడు దాని సందేశం యూఐడీఏఐకు పంపబడుతుంది. దీని తర్వాత పిల్లల ఫోటో, చిరునామా వంటి వివరాలు అందిన వెంటనే, వారి ఆధార్ నంబర్ అప్‌డేట్‌ అవుతుంది. ఈ విధంగా రెండు పనులు కూడా ఒకేసారి పూర్తవుతాయి.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం