Aadhaar: ఇప్పుడు మనం అనేక పత్రాలను మన గుర్తింపుగా ఉపయోగించుకోవచ్చు. కానీ, ఆధార్ అనేది ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అన్ని సేవల్లోనూ ఉపయోగపడుతున్న అత్యంత ప్రభావవంతమైన గుర్తింపు పత్రం. ఇది లేకుండా మన ముఖ్యమైన పనులు చాలావరకూ పూర్తి కావడంలేదు. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొత్త మొబైల్ నంబర్ తీసుకోవాలన్నా దాదాపు అన్ని చోట్లా ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డ్‌లో మన పేరు, తండ్రి పేరు, ఇంటి చిరునామా మాత్రమే కాకుండా మన వివరాలు కూడా ఉంటాయి. అందుకే దీనిని అద్భుతమైన గుర్తింపు రుజువుగా అన్ని సంస్థలు అంగీకరిస్తున్నాయి. దీంతో ఆధార్ అతి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది.
ఆధార్ కార్డ్‌లో ఉన్న యూనిక్ ఐడీ నంబర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. దీని తీవ్రత చాలా మందికి అర్థం కాకపోవడానికి ఇదే కారణం. సాధారణంగా, ఆధార్ నంబర్‌తో మోసం ఉండదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి విషయం సున్నితంగా మారిపోయింది. అందులో ఆధార్ నెంబర్ కూడా ఒకటి. అందువల్ల ఆధార్ నెంబర్ ఎవరికీ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఆధార్ నంబర్‌ను ఎందుకు షేర్ చేయకూడదు
వాస్తవానికి, మీ రహస్య సమాచారం అంతా ఆధార్‌లోని ప్రత్యేక ఐడీ నంబర్‌లో ఉంటుంది. మీ పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి చిరునామా, భౌతిక గుర్తింపు మొదలైనవాటిని ఆధార్ నంబర్ ద్వారా గుర్తించవచ్చు. అందువల్ల ఆధార్ నెంబర్ సహాయంతో మన గోప్యతను నేరస్థులు ఉపయోగించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
చాలా మంది ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి ప్రతిచోటా ఆధార్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ యూఐడీఏఐ(UIDAI) ఆధార్ నంబర్‌ను పబ్లిక్ చేయడానికి ఎందుకు నిరాకరిస్తుంది? అనే ప్రశ్న తలెత్తుతుంది>
ఆధార్ నంబర్‌ను షేర్ చేయడం గురించి యూఐడీఏఐ(UIDAI) ఏమి చెబుతోంది
ఈ ప్రశ్నకు సమాధానంగా, యూఐడీఏఐ ప్రతిచోటా పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్‌ను కూడా ఉపయోగిస్తుంది. అయితే, ఈ పత్రాలపై నమోదు చేయబడిన నంబర్‌లను మేము ఏ విధంగానూ పబ్లిక్ చేయము. మేము ఈ పత్రాలను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. అదేవిధంగా ఆధార్‌ను కూడా అవసరానికి మాత్రమే ఉపయోగించాలి. మీ ఆధార్ నెంబర్ ను బహిర్గత పరచడం వల్ల మీ రహస్య సమాచారం లీక్ అవ్వడంతోపాటు దుర్వినియోగం కూడా కావచ్చు.
ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..
Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?
CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్!