Aadhaar Card Update: ప్రస్తుతం భారత్‌లో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి పనులకు కూడా ఆధార్ ముఖ్యమైనదిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి పదేళ్లకోసారి తమ బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రజలను కోరింది.
యూఐడీఏఐ ప్రస్తుతం 5, 15 సంవత్సరాల వయసు దాటిన పిల్లను ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. యూఐడీఏఐ ప్రజలను వారి బయోమెట్రిక్స్, డెమో గ్రాఫిక్స్ వంటివి పదేళ్ల కోసారి అప్‌డేట్ చేయమని కోరుతుంటుంది. ఒక వ్యక్తి నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత 70 ఏళ్ల వయస్సు వారికి అవసరం లేదు. యూఐడీఏఐ మేఘాలయ, నాగాలాండ్, లడఖ్‌లలో కొద్ది శాతం మంది మినహా దేశంలోని దాదాపు అందరు వయోజనులను నమోదు చేసింది.
దేశంలోని చాలా ఆసుపత్రుల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ కార్డును నమోదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీ సమీపంలోని ఆధార్ కేంద్రం లేదా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా మీరు మీ పిల్లల ఆధార్ కార్డును పొందవచ్చు. పిల్లల ఆధార్‌ను పొందడానికి, మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను పూరించాలి. అందులో మీరు పిల్లలకు సంబంధించిన అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఫారమ్‌తో పాటు, మీరు కొన్ని ముఖ్యమైన పత్రాల ఫోటోకాపీలను కూడా జతచేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి