Aadhaar Update: మీరు ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4డాక్యుమెంట్లు తప్పనిసరి.. కొత్త రూల్స్‌!

Aadhaar Update: అలాంటి సమయంలో తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే కొత్త ఆధార్‌ కార్డు తీసుకోవాలని అందుకు సంబంధించిన ఫ్రూప్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు అవసరమైన..

Aadhaar Update: మీరు ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4డాక్యుమెంట్లు తప్పనిసరి.. కొత్త రూల్స్‌!
Aadhaar Card: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏడు సంవత్సరాల వయస్సు నిండిన పిల్లలు తమ ఆధార్‌ను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి చేసింది. వారు అప్‌డేట్‌ చేయకపోతే తమ ప్రయోజనాలను కోల్పోతారని కూడా హెచ్చరించింది. అందువల్ల ఆధార్ సేవా కేంద్రాల ద్వారా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని UIDAI స్పష్టం చేసింది.

Updated on: Jul 10, 2025 | 11:54 AM

ప్రస్తుతం ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. సిమ్‌ కార్డు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల వరకు ప్రతిదానికి అవసరం అవుతుంది. అయితే చాలా మంది ఆధార్‌లో పేరు తప్పుగా ఉండటం, మొబైల్‌ నెంబర్‌, ఇంటి ఇంటిపేరు, ఆడ్రస్‌ తదితర వాటిని మార్చాల్సిన అవసరం వస్తుంటుంది. అలాంటి సమయంలో తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే కొత్త ఆధార్‌ కార్డు తీసుకోవాలని అందుకు సంబంధించిన ఫ్రూప్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI) విడుదల చేసింది.

ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉండవచ్చా?

ఒకరి పేరుపై ఒకటి కంటే ఎక్కువ ఆధార్‌ కార్డులు ఉన్నట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మొదటి ఆధార్‌ నంబర్‌ మాత్రమే జనరేట్‌ అయి వ్యాలీడ్ అవుతుందని UIDAI స్పష్టం చేసింది. మిగతా కార్డులు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. బ్యాంకు కీలక నిర్ణయం..!

ఆధార్ కోసం 4 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవే :

  1. ఐడెంటిటీ ప్రూఫ్: మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫొటో ఐడెంటిటీ కార్డు, NREGA జాబ్ కార్డ్, పెన్షనర్ గుర్తింపు కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం/మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు, ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డులను డాక్యుమెంట్లుగా చూపించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
  2. అడ్రస్ ప్రూఫ్: అడ్రస్‌ను మార్చాలంటే దీని కోసం విద్యుత్, నీరు, గ్యాస్, ల్యాండ్‌లైన్ బిల్లు (3 నెలల కన్నా తక్కువ వయస్సు), బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రెంట్ అగ్రిమెంట్ (రిజిస్టర్డ్), పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు.
  3. బర్త్ సర్టిఫికేట్: పాఠశాల మార్క్ షీట్, పాస్‌పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్‌తో పెన్షన్ డాక్యుమెంట్, పుట్టిన తేదీతో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు.

ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ (అవసరమైతే) :

కొత్త నిబంధనల వల్ల ఎవరికి సమస్యలంటే? :

  • భారత పౌరులు
  • ఎన్నారైలు
  • 5 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు
  • దీర్ఘకాలిక వీసాపై భారత్‌లో నివసిస్తున్న విదేశీయులు
  • విదేశీయులు, OCI కార్డుదారులు తమ పాస్‌పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా FRRO రెసిడెన్సీ పర్మిట్ చూపించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Best Smartphones: మీ బడ్జెట్‌ రూ.25,000లోపునా..? బెస్ట్‌ కెమెరా ఉన్న ఉత్తమ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

ఇది కూడా చదవండి: Minimum Balance Rules: పండగ లాంటి వార్త.. ఈ బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేదు.. ఛార్జీలు రద్దు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి