Aadhaar Card: సమయం లేదు మిత్రమా.. ఆధార్‌ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌.. సెప్టెంబర్‌ 14 వరకే అవకాశం!

|

Aug 26, 2024 | 5:18 PM

ఈ రోజు ఆధార్ కార్డ్ ప్రతి వ్యక్తికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్ కార్డ్ దాదాపు ప్రతిచోటా చెల్లుబాటు అయ్యే IDగా పరిగణిస్తున్నారు. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆధార్ కార్డ్ అప్‌డేట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌లో మార్పులు చేసుకోవడానికి కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా, బయోమెట్రిక్స్ లేదా ఫోటోలో మార్పు కోసం ఆధార్‌ను అప్‌డేట్ చేయడం అవసరం..

Aadhaar Card: సమయం లేదు మిత్రమా.. ఆధార్‌ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌.. సెప్టెంబర్‌ 14 వరకే అవకాశం!
Aaadhaar Update
Follow us on

ఈ రోజు ఆధార్ కార్డ్ ప్రతి వ్యక్తికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్ కార్డ్ దాదాపు ప్రతిచోటా చెల్లుబాటు అయ్యే IDగా పరిగణిస్తున్నారు. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆధార్ కార్డ్ అప్‌డేట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌లో మార్పులు చేసుకోవడానికి కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా, బయోమెట్రిక్స్ లేదా ఫోటోలో మార్పు కోసం ఆధార్‌ను అప్‌డేట్ చేయడం అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్లు నిండిన ఆధార్‌కార్డును వెంటనే అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. ఇప్పుడు మీరు 14 సెప్టెంబర్ 2024లోపు ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే, మీరు దీని కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: September 1 Rule Changes: బిగ్‌ అలర్ట్‌.. సెప్టెంబర్‌ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్‌.. జేబుకు చిల్లులే..

ఇవి కూడా చదవండి

యూఐడీఏఐ (UIDAI) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి మరోసారి ఆధార్‌ కార్డుదారులను అలర్ట్‌ చేసింది. ఉచిత ఆధార్ అప్‌డేట్ తేదీని 14 సెప్టెంబర్ 2024 వరకు ఉన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ తేదీ జూన్ 14, 2024 వరకు ఉండేది. అయితే ఈ ఉచిత ఆధార్ సేవ మీకు My Aadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే మీరు మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళితే, మీరు దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

అప్‌డేట్‌ చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

ఇప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా అవసరం. ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, చిరునామా రుజువును కలిగి ఉండాలి. మీరు గుర్తింపు రుజువుగా పాన్ కార్డును, చిరునామా కోసం ఓటర్ కార్డును ఉపయోగించవచ్చు. ఉచిత ఆధార్‌ను అప్‌డేట్ చేసే తేదీని పొడిగించడం ఇది మూడోసారి. అటువంటి పరిస్థితిలో మీ ఆధార్ కూడా అప్‌డేట్ కాకపోతే వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి.

ఇంట్లో కూర్చొని అప్‌డేట్‌ చేసుకోండిలా..

ఇప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేయడం చాలా సులభం. ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.

  1. ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in సందర్శించాలి.
  2. ఆధార్ నంబర్‌తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, Send OTPపై క్లిక్ చేయండి.
  3. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి లాగిన్ చేయండి.
  4. దీని తర్వాత, UIDAI వెబ్‌సైట్‌లో కనిపించే పేజీలో, చిరునామా అప్‌డేట్‌పై క్లిక్ చేసి, ఆపై అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి. అక్కడ అడిగే పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
  5. ఆ తర్వాత మీరు అప్‌డేట్ చేయాల్సిన సమాచారాన్ని నమోదు చేసి ప్రాసెస్ టు అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.
  6. పై విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు ఆధార్ కార్డును సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Train Coaches: సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి