Fish Farming: తమిళనాడుతో టాక్ ఆఫ్ ద టౌన్ ఈ రైతు.. ఇతని టెక్నిక్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే..

వ్యవసాయాధారితమైన మన దేశంలో దాని అనుబంధ రంగాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంది. పంటతో పాటు పశువుల పెంపకం మనకు ముఖ్యమైన ఆదాయ వనరు. పొలంలో ఒక పంటను పండిస్తున్నప్పుడు అంతరపంటలపై కూడా పెంచుతాం. దానివల్ల వచ్చే అదనపు ఆదాయం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇదే తరహాలో చేపల చెరువులను నిర్వహిస్తూ, కోళ్లు, మేకలు, పశువులను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు.

Fish Farming: తమిళనాడుతో టాక్ ఆఫ్ ద టౌన్ ఈ రైతు.. ఇతని టెక్నిక్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే..
వేసవిలో రెడ్ మీట్ ముట్టుకోకూడదు. బదులుగా చేపలు తినడం మంచిది. చేపలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. చేప పులుసు కూడా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. లస్సీ, మజ్జిగ వంటి పానియాలు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రోబయోటిక్స్, ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉండే ఈ పానీయాలు శరీరానికి పోషణనిచ్చి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే పెరుగులోనూ కాల్షియం, ప్రొటీన్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు, పేగుల ఆరోగ్యాన్ని పెరుగు కాపాడుతుంది.

Updated on: Mar 08, 2024 | 6:53 AM

ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని బయటకు తీసి సానపడితే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఎంచుకున్నరంగం ఏదైనా కావచ్చు. అందులో వందశాతం కష్ట పడితేనే విజయం చేకూరుతుంది. అలా తనకు తెలిసిన పనిలో నూరుశాతం విజయం సాధించి, ఆదాయంతో పాటు అభినందనలు అందుకున్నవారు మనకు చాలామంది కనిపిస్తారు.అలాంటి వారి చేపల పెంపకాన్ని శ్రద్ధతో చేపట్టి నంబర్ వన్ గా నిలిచిన ఈ రైతు ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ రైతు చేపల సాగునే వినూత్నంగా చేపట్టి అందరి మన్ననలు పొందుతున్నారు. ఇంతకీ ఎవరా రైతు? ఏంటి ఆయన ప్రత్యేకత తెలుసుకుందాం.. రండి..

అదనపు ఆదాయం..

వ్యవసాయాధారితమైన మన దేశంలో దాని అనుబంధ రంగాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంది. పంటతో పాటు పశువుల పెంపకం మనకు ముఖ్యమైన ఆదాయ వనరు. పొలంలో ఒక పంటను పండిస్తున్నప్పుడు అంతరపంటలపై కూడా పెంచుతాం. దానివల్ల వచ్చే అదనపు ఆదాయం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇదే తరహాలో చేపల చెరువులను నిర్వహిస్తూ, కోళ్లు, మేకలు, పశువులను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. అదనపు ఆదాయం సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా మారాడు. అతడే తమిళనాడు ఫిష్ గ్రోవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమశివం.

16 ఎకరాలలో 24 చెరువులు..

తమిళనాడులోని తంజావూరు జిల్లా ఒరతనాడు సమీపంలోని బుడూర్ గ్రామానికి చెందిన పరమశివం అనే రైతు చేపల పెంపకంలో ప్రత్యేకత సాధించాడు. 16 ఎకరాల భూమిలో 24 చెరువులను తవ్వించాడు. సేంద్రియ పద్ధతిలో చేపల పెంపకం చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు. తద్వారా మంచి ఆదాయం పొందడంతో పాటు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దాదాపు 23 ఏళ్లుగా అతడు ఈ పనిలో కొనసాగుతున్నాడు. తన తోటి రైతులకు చేపల పెంపకంపై శిక్షణ కూడా ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఈ క్రమంలో చేపల పెంపకంలో పాటిస్తున్న మెలకువలు, ఆదాయం పెంచుకోవడానికి అవలంభించాల్సిన పద్ధతులను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

మార్గదర్శకాలు..

ఒక ఎకరం భూమిలో చేపల పెంపకాన్ని చేపడితే, కొబ్బరి వంటి అదనపు పంటలు, మేకలు, ఆవులు, గేదెలు, కోళ్లను కూడా పెంచవచ్చు. తద్వారా అదనపు ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా చేపల పెంపకంలో కొన్ని నిర్ధిష్ట మార్గదర్శకాలు అనుసరించాలి. చెరువులో 7.5 pH నీటి స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యం. దీనితో పాటు చెరువును తూర్పు నుంచి పడమర దిశలో ఉంచడం ద్వారా నేరుగా సూర్యరశ్మి పడుతుంది. అలాగే చేపలకు ఇచ్చే ఆహారం కూడా వాటి పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. నిర్ణీత వేళల్లో సరైన మోతాదులో మేత వేసినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది.

ఖర్చు తగ్గించుకునే విధానం..

చేపల పెరగడానికి సుమారు పది నెలలు పడుతుంది. వీటితో పాటు ఎకరం భూమిలో సుమారు ఆరువేల కోడిపిల్లలను పెంచుకోవచ్చు. సాధారణంగా ఒక టన్ను చేపలకు ఒకటిన్నర టన్నుల ఫీడ్ అవసరమవుతుంది. ఈ కోడి పిల్లల ద్వారా ఆ ఫీడ్ చేపలకు అందుతుంది. అలాగే చెరువులో స్వచ్ఛమైన నీరు, మంచి మట్టి ఉంటే ఈ ఖర్చు మరింత తగ్గుతుంది.
అదే విధంగా చెరువులో ప్రోబయోటిక్స్‌ను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరమశివం సూచించారు. వీటివల్ల చేపలు మేత, ఆక్సిజన్‌ను మరింత సమర్థంగా వినియోగించుకుంటాయి. అలాగే చేపల బరువును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా ముఖ్యం, కాంటినెంటల్ ఫీడ్‌ను చెరువులోకి విపరీతంగా వేయడం మానుకోవాలి. అది నేల, నీటి వనరులను వృథా చేస్తుంది. చివరికి చేపల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..