Skoda cars: స్కోడా కార్ల యజమానులకు షాక్.. కంగారు పెట్టిస్తున్న సెక్యూరిటీ సంస్థ నివేదిక

|

Dec 15, 2024 | 5:35 PM

సాధారణంగా కార్లలో అనేక భద్రత, రక్షణ పరమైన ఫీచర్లు ఉంటాయి. సురక్షిత ప్రయాణానికి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. పెరిగిన సాంకేతికత ద్వారా ఇలాంటి పరికరాలను కార్లలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అలాంటి పరికరాలే కారు భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. యజమానులకు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. ఇటీవల స్కోడా కార్లలోని ఇన్ఫోటైన్ మెంట్ యూనిట్ లో వైఫల్యాన్ని పరిశోధకులు కనిపెట్టారు. వీటి ద్వారా కారును హ్యాక్ చేసే అవకాశం ఉందని తెలిపారు.

Skoda cars: స్కోడా కార్ల యజమానులకు షాక్.. కంగారు పెట్టిస్తున్న సెక్యూరిటీ సంస్థ నివేదిక
Skoda
Follow us on

స్కోడా కార్లంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వీటిలో అనేక అప్ డేట్లు చేస్తూ, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. స్కోడా సూపర్బ్ త్రీ సెడాన్ లోని ఇన్ఫో టైన్ మెంట్ సిస్టమ్ లోని 12 భద్రతా లోపాలను పీసీ ఆటోమోటివ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెలుగులోకి తీసుకువచ్చింది. వీటివల్ల కార్ల యజమానులకు కలిగే ప్రమాదాలను తెలిపింది. స్కోడా కారులోని భద్రతా లోపాల కారణంగా వాహనాన్ని హ్యాకర్లు నియంత్రించే ప్రమాదం ఉంది. కారును సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా ట్రాక్ చేయగలుగుతారు. కారు వెళ్లే లోకేషన్ తెలిసి పోవడం వల్ల అపాయం పొంచి ఉంది. అలాగే కారు యజమాని వ్యక్తిగత డేటాను తస్కరించే అవకాశం ఉంది. అలాగే కారు ఫంక్షన్లలను సైతం నియంత్రించే వీలు కలుగుతుంది.

పీసీ ఆటోమోటివ్ సంస్థకు యూరప్ లోని ఆటో మార్కెట్ లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. స్కోడా కారులోని భద్రతా లోపాలను దీని పరిశోధకులు గుర్తించారు. స్కోడా సూపర్బ్ త్రీ సెడాన్ లోని ఇన్పోటైన్మెంట్ లోని 12 రకాల లోపాలను వెల్లడించారు. వోక్స్ వాగన్ యాజమాన్యంలోని స్కోడా ఎంఐబీ త్రీ అనే ఇన్పోటైన్మెంట్ యూనిట్లను తన కార్లలో వినియోగిస్తుంది. వీటి లోని లోపాల కారణంగా హాకర్లు మీడియా యూనిట్ కు కనెక్ట్ అనే అవకాశం ఉంది. జీపీఎస్, స్పీడ్ డేటా ను తెలుసుకోవడానికి, కారు మైక్రోఫోన్ ను ఉపయోగించి సంభాషణలను రికార్డు చేయడానికి, డిస్ ప్లే స్క్రీన్ షాట్ లు తీయడానికి, కారులో శబ్ధాలను ప్లే చేయడానికి హాకర్లను అవకాశం కలుగుతుంది.

వోక్స్ వ్యాగన్, స్కోడా మోడళ్లలో ఎంఐబీ 3 యూనిట్లను వినియోగిస్తున్నారు. దాదాపు 1.4 మిలియన్లకు పైగా వాహనాలకు ఈ ప్రమాదం పొంచి ఉంది. కార్లలోని ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు బ్ల్యూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ లో సైతం లోపాలు ఉండే అవకాశం ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. కారు యజమాని తన ఫోన్ కాంటాక్ట్ లిస్టును వాహనానికి కనెక్ట్ చేస్తే హ్యాకర్లు.. దానిలోని డేటాను దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్లను వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సంచలనం రేపిన ఈ నివేదకపై స్కోడా కంపెనీ ప్రతినిధి టామ్ డ్రెచ్లర్ స్పందించారు. తమ కార్లలోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో లోపాలు ఉన్నట్టు నివేదిక వచ్చిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ కస్టమర్లకు, వారి వాహనాలకు భద్రతకు ఎప్పుడు ముప్పు ఏర్పడలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి