Indian Startup: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. యజమాని నిర్ణయంతో నమ్మలేని లాభాలు

ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేసే వారి కంటే ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొంత మంది ప్రత్యేకంగా ఆలోచించే వారు వ్యాపార రంగంలో రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నస్థాయి నుంచి వచ్చిన వారైత వ్యాపారంలో ఉద్యోగుల పాత్రను గుర్తించి వారికి వివిధ నజరానాలు ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు తీసుకున్న నిర్ణయంతో ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ లాటరీ తగిలినట్లయ్యింది. ప్రతి ఒక్క ఉద్యోగికి లక్షల్లో లాభం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు తీసుకున్న నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Indian Startup: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. యజమాని నిర్ణయంతో నమ్మలేని లాభాలు
Investment Advisor
Follow us

|

Updated on: Oct 25, 2024 | 2:45 PM

భారతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకుడు తన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించేందుకు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. స్టార్టప్ యాప్‌ డైనమిక్స్‌లో పని చేసిన వారు ప్రస్తుతం లక్షాధికారులుగా మారారు. 2017లో యాప్ డైనమిక్స్ చైర్మన్ అయిన జ్యోతి బన్సాల్ తన కంపెనీని 3.7 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయాలనుకున్న సిస్కో నుండి ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుకున్నారు. యాప్ డైనమిక్స్ పబ్లిక్‌గా వెళ్లాలని ఆఫర్ వచ్చాక బన్సాల్ తన ఉద్యోగులకు గణనీయమైన ద్రవ్య సహాయాన్ని అందించడానికి దీనిని ఒక అవకాశంగా తీసుకున్నాడు. అతను సిస్కో ఆఫర్‌ని అంగీకరించిన తర్వాత దాదాపు 400 మంది సిబ్బంది తమ షేర్ల విలువ కనీసం 1 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అలాగే కొంత మంది ఉద్యోగుల షేర్ల ధర 5 మిలియన్ల డాలర్లకు కూడా చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. 

46 ఏళ్ల బన్సల్ తన స్టార్టప్‌ను విక్రయించాలని ఎంచుకున్నప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాడు. వాటిలో ఒకటి సిస్కో పోర్ట్‌ఫోలియోతో యాప్ డైనమిక్స్  ఉత్పత్తుల అనుకూలతను ముఖ్యంగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ విక్రయం సంస్థకు సంబంధించిన 1200 మంది సిబ్బందిపై ప్రభావం పడుతుందని వారికి కూడా న్యాయం చేయాలని భావించాడు. బన్సల్ తన కంపెనీకు సంబంధించిన పోస్ట్-ఐపీఓ ప్రొజెక్షన్‌ను కూడా అంచనా వేసి, సిస్కోకు సంబంధించిన వాల్యుయేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే 3.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌ను పొందేందుకు తనకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేశాడు. ఈ నేపథ్యంలో కంపెనీని విక్రయించడం ద్వారా తన సిబ్బందికి ప్రమాదాన్ని తగ్గించవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే స్టార్టప్‌లో 14 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నందున బన్సాల్ గణనీయమైన లాభాలను పొందారు. బన్సాల్ కొన్నిసార్లు తాను కంపెనీని పెంచుకోవచ్చని భావించాడు. కానీ అతను నిర్ణయం తీసుకున్నప్పుడు తన ఉద్యోగుల ప్రయోజనాల కోసం విక్రయం విషయంలో తీసుకున్న నిర్ణయం సరైందని భావించాడు. 2022లో 3.7 బిలియన్ల డాలర్ల విలువ కలిగిన హార్నెస్, ట్రేసబుల్ అనే మరో రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలను స్థాపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..