EV Scooters: ఫోన్ ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్.. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్కూటర్ గురించి తెలుసుకోండి

అయితే ఆ ఈవీ వాహనాల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో ఓ స్థాయి ప్రజల వరకూ మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఉజాస్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉజాస్ ఈజెడ్‌వై పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ అందరికీ అందుబాటు ధరలోనే కంపెనీ లాంచ్ చేసింది.

EV Scooters: ఫోన్ ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్.. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్కూటర్ గురించి తెలుసుకోండి
Ujass
Follow us
Srinu

|

Updated on: Apr 22, 2023 | 4:30 PM

భారతదేశంలో ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఈవీ వాహనాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. వినియోగదారుల నుంచి అమాంతంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు సరికొత్తగా ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. బైక్స్, కార్లతో పోలిస్తే కంపెనీలు ఎక్కువగా స్కూటర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఆ ఈవీ వాహనాల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో ఓ స్థాయి ప్రజల వరకూ మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఉజాస్ ఎనర్జీ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉజాస్ ఈజెడ్‌వై పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ అందరికీ అందుబాటు ధరలోనే కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 50 కంటే ఎక్కువ కంపెనీలు ఈవీ వాహనాలను అందిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇచ్చే ధర కంటే తక్కువ ధరకే ఉజాస్ స్కూటర్లను అందిస్తుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేని ఈ స్కూటర్ గురించి ఇతర వివరాలు ఏంటో సారి చూద్దాం.

బ్యాటరీ, రేంజ్

ఉజాస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ స్కూటర్‌లో 60వీ/26ఏహెచ్ బ్యాటరీ, 250 డబ్ల్యూ మోటార్‌ను అందించింది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 20 కిలోమీటర్లు. వినియోగదారుడు ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ తక్కువ శ్రేణి ఈవీ ఆఫీసు, కళాశాలకు వెళ్లే వారికి అనువుగా ఉంటుంది.

అదిరిపోయే ఫీచర్లు ఇవే

తక్కువ బడ్జెట్ఈవీలో ఉజాస్ కంపెనీ చాలా ఫీచర్లను అందించింది. ఉజాస్ ఈజెడ్‌వై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడో మీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ డిస్‌ప్లే, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్, కీలెస్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే రైడింగ్ రివర్స్ డ్రైవింగ్ గేర్ వంటి అనేక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

అతి తక్కువ ధర

ఉజాస్ ఈజెడ్‌వై ద్విచక్ర వాహనం మొత్తం ధర రూ. 31,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. కంపెనీ కస్టమర్ల కోసం ప్రత్యేక ఫైనాన్స్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. తద్వారా కస్టమర్లు పూర్తిగా ఈవీని కొనుగోలు చేసే భారాన్ని భరించాల్సిన అవసరం లేదు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
మన్మోహన్ సింగ్‌కు ఉన్న వ్యాధులు ఏ వయస్సు తర్వాత వస్తాయి?
మన్మోహన్ సింగ్‌కు ఉన్న వ్యాధులు ఏ వయస్సు తర్వాత వస్తాయి?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..