7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపు!

|

Sep 20, 2022 | 9:00 AM

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైన శుభవార్త. నవరాత్రులకు ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని 3% పెంచింది...

7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపు!
7th Pay Commission
Follow us on

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైన శుభవార్త. నవరాత్రులకు ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని 3% పెంచింది. అయితే పండుగకు ముందు ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచే ప్రతిపాదనకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం ఆమోదం తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం, కరువు భత్యంలో 3 శాతం పెంపుదల ఆమోదించబడింది.

కొత్త ప్రకటనలో, ఉద్యోగుల కరువు భత్యాన్ని ప్రస్తుతమున్న 31 శాతం నుండి 34 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ జనవరి 1, 2022 నుండి వర్తిస్తుంది. అంటే దీనితో పాటు ఉద్యోగులకు 8 నెలల బకాయిలు కూడా వస్తాయి. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 4 లక్షల మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి జనవరి నుంచి ఆగస్టు వరకు ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ బకాయిలను విడిగా చెల్లిస్తామని తెలియజేసింది.

కేంద్ర ఉద్యోగులతో సమానంగా డీఏ

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ కూడా ప్రస్తుతం 34 శాతంగా ఉండటం గమనార్హం. అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కరువు భత్యం లభిస్తుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెంపును కూడా ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ AICPI డేటాపై ఆధారపడి ఉంటుంది. ఎఐసిపిఐ డేటా ఆధారంగా కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని నిర్ణయించారు. కానీ ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి