AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renault Triber: రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌

ఈ ఇంజన్‌ 96ఎన్‌ఎమ్‌ టార్క్‌, 72పీఎస్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ కారు లీటర్‌కు 18.9 నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది. 5 స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ కారులో 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను అందించారు...

Renault Triber: రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌
Renault Triber
Narender Vaitla
|

Updated on: Jun 17, 2024 | 9:58 AM

Share

ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 7 సీటర్‌ కారు అనగానే ఎక్కువ బడ్జెట్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. పెద్ద కారు కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కు రూ. 8 లక్షలైనా పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ఓ 7 సీటర్‌ కారు అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా కారు.? అందులోని ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రెంచ్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌ నుంచి వచ్చి 7 సీటర్‌ ట్రైబర్‌ కారుకు మంచి ఆదరణ లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ బేసిక్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 5.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక టాప్‌ ఎండ్ విషయానికొస్తే ఈ కారు ధర సుమారు రూ. 8.12 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌తో లభిస్తోంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ వేరియంట్‌తో ఈ కారును తీసుకొచ్చారు.

ఈ ఇంజన్‌ 96ఎన్‌ఎమ్‌ టార్క్‌, 72పీఎస్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ కారు లీటర్‌కు 18.9 నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది. 5 స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ కారులో 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను అందించారు.

అలాగే ఇందులో ఎల్‌ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, LED DRLలతో ప్రొజెక్టర్ హ్యాండ్‌ల్యాప్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ కూల్డ్ స్టోరేజ్, 182mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో అందించారు. ఇక భద్రత విషయానికొస్తే ఈ కారులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు (2 ముందు, 2 వైపు) ఉన్నాయి. గ్లోబల్ NCAP ఈ కారుకు పెద్దలకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?