
భారతదేశంలో చాలా మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై నమ్మకమైన రాబడిని పొందాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం స్థిర ఆదాయ పథకాలైన ఎఫ్‌డీ, ఆర్‌డీ, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటి పథకాల్లో పెట్టుబడిపెడుతూ ఉంటారు. అయితే కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని పొందేందుకు స్టాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇనుము, ఉక్కు తయారీ కంపెనీ జై బాలాజీ ఇండస్ట్రీస్ ప్రస్తుతం బీఎస్‌ఈలో రూ.1139 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో జై బాలాజీ ఇండస్ట్రీస్ షేర్లు 2.89 శాతం జంప్‌తో రూ.1085.55 (జై బాలాజీ షేర్ ధర) వద్ద ముగిశాయి. మార్చి 28, 2023న జై బాలాజీ ఇండస్ట్రీస్ షేర్ల ధర రూ. 42. దీని తర్వాత 10 నెలల్లో 2600 శాతం ఎగబాకి, జనవరి 30, 2024న రూ.1134కి చేరుకుంది. ఇది ఒక ఏడాది రికార్డు గరిష్టం. ఈ నేపథ్యంలో జై బాలాజీ షేర్ ధరకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఏప్రిల్-డిసెంబర్ 2023లో కంపెనీ నికర లాభం సంవత్సరానికి (వైవై) 755 శాతం పెరిగి రూ. 606.59 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌వై23) కంపెనీ రూ. 57.83 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ విధంగా అది పెట్టుబడిదారుడికి సంబంధించిన రూ. 1 లక్షను ఒక సంవత్సరంలో రూ. 18 లక్షలకు పైగా మార్చింది. ఈ కంపెనీ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,407.9 కోట్ల రుణాన్ని కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంటే ఎఫ్‌వై 24 డిసెంబర్ త్రైమాసికంలో ఈ రుణం ఇప్పుడు రూ. 566.50కి తగ్గింది. అదనంగా కంపెనీ లాభం కూడా ప్రతి త్రైమాసికంలో 740 శాతం పెరిగింది. ఎఫ్‌వై 24 చివరి త్రైమాసికంలో కంపెనీ లాభం 740 శాతం పెరిగి రూ.234.60 కోట్లకు చేరుకుంది.
ఈ వృద్ధిపై జై బాలాజీ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య జజోడియా మాట్లాడుతూ సంస్థ గత 6-7 సంవత్సరాలలో కఠినమైన సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. నిర్వహణ, వ్యాపార సహచరులు, వాటాదారుల నిబద్ధత, కృషి, విశ్వాస, స్థితిస్థాపకత కారణంగా ఈ సమస్యలు తీరాయని పేర్కొన్నారు. ఈ కంపెనీ వచ్చే 18 నెలల్లో నికర రుణ రహితంగా మారాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే జై బాలాజీ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 15 శాతం మేర దూసుకెళ్లాయి. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు ఈ స్టాక్ దాదాపు 40 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో ఈ మల్టీ బ్యాగర్ షేర్ 7716 శాతం పెరిగింది. ప్రస్తుతం 52 వారాల గరిష్ట విలువతో ట్రేడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి