భారతదేశంలో ఇన్సూరెన్స్ పథకాల్లో పెట్టుబడి అంటే అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎల్‌ఐసీతో భారతీయులకు ఓ విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అలాగే బీమా చెల్లింపు విషయంలో కూడా ఎల్‌ఐసీ కస్టమర్ల నమ్మకాన్ని పొందింది. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్‌ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఎల్‌ఐసీ ప్రస్తుతం అందించే ఉమంగ్ ప్లాన్ గురించి ఓ సారి తెలుసకుందాం. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది ముఖ్యంగా కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణను అందించడానికి ఎల్‌ఐసీ రూపొందించింది. ప్రీమియం-చెల్లింపు వ్యవధి ముగింపు నుంచి మెచ్యూరిటీ సమయం వరకూ ఈ ప్లాన్ వార్షిక సర్వైవర్ ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా ఈ పాలసీలో మెచ్యూరిటీ తర్వాత లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో ఒకేసారి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి సహాయం చేయడానికి ఇది డబ్బు, బీమా కవరేజీ రెండింటినీ అందించడమే ఈ ప్లాన్ ప్రాథమిక ప్రయోజనం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో హామీ ఇవ్వబడిన ప్రయోజనాలు నమ్మకమైన ఆర్థిక భద్రతా వలయంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
ఈ పాలసీని కొనుగోలు చేసే 30 ఏళ్ల పురుషుడు నెలవారీ రూ. 5,000, త్రైమాసిక రూ. 15,000 లేదా సంవత్సరానికి రూ. 50,000 పెట్టుబడి పెట్టవచ్చు. కనీస హామీ మొత్తం రూ. 2,00,000. అయితే పాలసీలో ప్రవేశించే సమయానికి అతని మూప్పై ఏళ్లు ఉంటే రూ.10 లక్షల హామీ మొత్తం ఉంటుంది. అలాగే ఈ పాలసీ చెల్లింపు వ్యవధి ఇరవై ఏళ్లు ఉంటుంది. అలాగే 70 సంవత్సరాల రిస్క్ కవరేజ్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..