Rajya Sabha Session Reschedule: రాజ్యసభ సమావేశాలు రీషెడ్యూల్.. ఫిబ్రవరి 13తో ముగియనున్న సమావేశాలు

|

Feb 02, 2021 | 11:04 AM

Rajya Sabha Session Reschedule: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత నెల 29న ప్రారంభమైన ఈ సమావేశాలు.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను..

Rajya Sabha Session Reschedule: రాజ్యసభ సమావేశాలు రీషెడ్యూల్.. ఫిబ్రవరి 13తో ముగియనున్న సమావేశాలు
Follow us on

Rajya Sabha Session Reschedule: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత నెల 29న ప్రారంభమైన ఈ సమావేశాలు.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. ఇక కోవిడ్‌ నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభలను వేర్వేరు సమావేశాల్లో నిర్వహిస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలలో ఏప్రిల్‌ 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. తొలివిడత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో విడత మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరగనున్నాయి. అయితే రెండు విడతల్లో జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల తొలి విడత నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15న కాకుండా ఫిబ్రవరి 13న ముగియనుంది రాజ్యసభ. గ్రాంట్లకు సంబంధించిన డిమాండ్ల పరిశీలనకు వీలుగా రాజ్యసభ సమావేశాలను కుదించారు. రెండో విడత సమావేశాలు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం మార్చి 8న ప్రారంభమవుతాయి.

Also Read:

Rajya Sabha: రైతు ఆందోళనలపై రాజ్యసభలో గందరగోళం.. చర్చకు చైర్మన్ నిరాకరణ.. వాకౌట్ చేసిన విపక్షాలు

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ కార్డును ఎవరెవరు పొందవచ్చు