Budget 2023: వీఆర్ఎస్ తీసుకునే వారు ఎంత పన్ను చెల్లించాలి.. ట్యాక్స్ విధానం ఎలా ఉండబోతోంది?..

|

Jan 27, 2023 | 8:49 AM

ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకం కానుంది.

Budget 2023: వీఆర్ఎస్ తీసుకునే వారు ఎంత పన్ను చెల్లించాలి.. ట్యాక్స్ విధానం ఎలా ఉండబోతోంది?..
Vrs
Follow us on

ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకం కానుంది. అయితే ఆర్థికమాంద్యం భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సామాన్య ప్రజలతో పాటు ఆర్థిక వ్యవస్థ కోసం ఎలాంటి రోడ్‌మ్యాప్‌ను తీసుకువస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఉద్యోగుల నుంచి, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఈ బడ్జెట్‌పై కొన్ని ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. వీరిలో స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) తీసుకోవాలని ఆలోచిస్తున్న వ్యక్తులు, ఇప్పటికే తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇప్పటి వరకు ఉన్న పన్ను నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ అంటే పదవీ విరమణ సమయానికి ముందు VRS తీసుకుంటే, అతనికి వచ్చిన మొత్తంలో రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పన్ను మినహాయింపు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం. అతను అందుకున్న మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగి కూడా నిర్దేశించిన స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.

VRSలో ఒక్కసారి మాత్రమే పన్ను మినహాయింపు..

ఆదాయపు పన్ను నియమాలు, నిబంధనల ప్రకారం.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఉద్యోగికి ఒకసారి మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ప్రభుత్వోద్యోగి ఒక చోట నుండి VRS తీసుకున్న తర్వాత, మరొక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేసి, కొంతకాలం తర్వాత అక్కడ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే.. అప్పుడు పన్ను మినహాయింపు ప్రయోజనం లభించదు. అంటే ఉద్యోగి ఒక్కసారి మాత్రమే పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతాడు.

ఇవి కూడా చదవండి

ఐదు లక్షల కంటే ఎక్కువ మొత్తానికి పన్ను విధించబడుతుంది..

VRS తర్వాత వచ్చిన మొత్తంపై ఎంత పన్ను విధించబడుతుందో ఈ విధంగా అంచనా వేయవచ్చు. ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేటప్పుడు రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని పొందినట్లయితే.. ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రూ. 5 లక్షలు దాటితే.. పెరిగిన డబ్బుకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో వీఆర్‌ఎస్ తీసుకునే వారి కోసం ప్రభుత్వం కొత్తగా ఏమైనా తీసుకువస్తుందా? లేదా? అనేది ఫిబ్రవరి 1న తేలనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..