Budget 2022 Reactions:నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై అధికార పార్టీ నేతలు ఏమన్నారంటే..?

2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌.

Budget 2022 Reactions:నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై అధికార పార్టీ నేతలు ఏమన్నారంటే..?

Updated on: Feb 01, 2022 | 3:15 PM

BJP Leaders Budget 2022 Reactions: 2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం కేంద్ర బడ్జెట్‌(Budget 2022)ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఈ బడ్జెట్ కరోనా మహమ్మారి మూడవ వేవ్ సహా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు ముందు సమర్పించబడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ బడ్జెట్ ప్రాముఖ్యత పెరుగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు పెద్ద ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను అధికార పార్టీతో సంబంధమున్న నేతలు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇందులో హోంమంత్రి అమిత్ షా , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి జయంత్‌ సిన్హా వంటి పలువురు నేతల పేర్లు ఉన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పార్లమెంటులో సమర్పించిన 2022 23 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను “దార్శనికత”గా అభివర్ణించారు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను “స్కేల్ ఛేంజర్”గా రుజువు చేస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందిస్తూ, ఈ బడ్జెట్ భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా’ మారుస్తుందని, అలాగే స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాల కొత్త భారతదేశానికి పునాది వేస్తుందని షా అన్నారు.


రక్షణ సహా పలు రంగాల్లో పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తం కేటాయించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థల కోసం R&D బడ్జెట్‌లో 25 శాతం రిజర్వ్ చేయాలనే ప్రతిపాదన అద్భుతమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


ఈసారి బడ్జెట్ గురించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఇది చాలా మంచి బడ్జెట్ అని అన్నారు. పేదలు, గ్రామీణ, సరిహద్దు ప్రాంతాలు.. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో నివసించే ప్రజలతో సహా సమాజంలోని ప్రతి వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే చాలా కలుపుకొని ఉన్న బడ్జెట్ ఇది అని కిరన్ రిజిజు కొనియాడారు.


సామాన్యులకు ఇది చాలా మంచి బడ్జెట్ అని బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. మౌలిక సదుపాయాలు 35% పెరిగాయి, ఇది ఆర్థిక వ్యవస్థను స్వయంచాలకంగా వేగవంతం చేస్తుంది. దేశంలోని డబ్బును ఇక్కడే వెచ్చిస్తూ.. మన దేశంలోని తయారీ రంగాన్ని వేగవంతం చేసే బూస్టర్ షాట్ ఇది అని అభిప్రాయపడ్డారు.


బడ్జెట్‌ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా మాట్లాడుతూ.. క్యాపిటల్‌ వ్యయానికి పెద్దపీట వేసే బడ్జెట్‌ ఇది. ఈ పెట్టుబడి GDP వృద్ధిని పెంచుతుంది. ఇది ప్రతి ద్రవ్యోల్బణ బడ్జెట్ మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది. దీనివల్ల విపరీతమైన ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు.