మరి…ఇలా ఉంటే కరోనా వైరస్ చెక్ ఎలా ? ఇండోనేసియాలో దారుణం !

| Edited By: Anil kumar poka

Apr 26, 2020 | 11:34 AM

కరోనా వైరస్ మహమ్మారికి చైనాయే కారణమని, ఆ దేశంలోని వూహాన్ సిటీ నుంచి ఈ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు  నిప్పులు కక్కుతున్నాయి. కానీ చైనా మాత్రం మనుషుల నుంచే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని వాదిస్తోంది.

మరి...ఇలా ఉంటే కరోనా వైరస్ చెక్ ఎలా ? ఇండోనేసియాలో దారుణం !
Follow us on

కరోనా వైరస్ మహమ్మారికి చైనాయే కారణమని, ఆ దేశంలోని వూహాన్ సిటీ నుంచి ఈ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు  నిప్పులు కక్కుతున్నాయి. కానీ చైనా మాత్రం మనుషుల నుంచే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని వాదిస్తోంది. కానీ ఇండోనేసియా వంటి దేశాలు కూడా ఈ విధమైన వైరస్ లకు కారణమవుతుంటే ఆయా దేశాలు నోరెత్తడంలేదు. ఇండోనేసియా లోని  ‘టోమోహాన్ మార్కెట్’ లో హానికారక వైరస్ లను కలిగి ఉన్న గబ్బిలాలను కొట్టి చంపుతున్నారు. ఇక ఎలుకలు, కుక్కలు, పాములు వంటివాటి సంగత్గి సరేసరి! వీటి మాంసాన్ని బహిరంగంగా..అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయా వెబ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ హెల్త్ క్రైసిస్ మానవాళిని మరింత సంక్షోభం లోకి నెట్టివేస్తోందంటే ఇందుకు కారణాలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయంటున్నారు నిపుణులు.. దీనికి కళ్లెం వేసేవారెవరు అని ప్రశ్నిస్తున్నారు. మరణ మృదంగం అదే పనిగా మోగుతోందంటే ఇందుకు మనిషే కారణం కాదా అంటున్నారు వాళ్ళు !