#WhatsApp: వదంతుల నియంత్రణకు వాట్సప్ యాక్షన్.. ఇక ఫార్వర్డ్ కష్టమే

| Edited By: Anil kumar poka

Apr 07, 2020 | 1:51 PM

కరోనా వ్యాప్తి ఒకవైపు అందరిలోను కలవరం రేపుతున్న తరుణంలో కొందరు ఆకతాయిలు వ్యాపింపచేస్తున్న వదంతులు ప్రజల్లో మరింత టెన్షన్ పెంచుతున్నాయి. కరోనాకు సంబంధించిన అంశాలతోపాటు లాక్ డౌన్, తబ్లిఘీ, తిరుమల, కాణిపాకం వంటి అంశాలపై లేనిపోని వదంతులు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి.

#WhatsApp: వదంతుల నియంత్రణకు వాట్సప్ యాక్షన్.. ఇక ఫార్వర్డ్ కష్టమే
Follow us on

WhatsApp has taken a super decision to control rumors: కరోనా వ్యాప్తి ఒకవైపు అందరిలోను కలవరం రేపుతున్న తరుణంలో కొందరు ఆకతాయిలు వ్యాపింపచేస్తున్న వదంతులు ప్రజల్లో మరింత టెన్షన్ పెంచుతున్నాయి. కరోనాకు సంబంధించిన అంశాలతోపాటు లాక్ డౌన్, తబ్లిఘీ, తిరుమల, కాణిపాకం వంటి అంశాలపై లేనిపోని వదంతులు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వదంతులను వ్యాపింపచేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా వదంతులు, పుకార్లు ఆగని పరిస్థితిలో స్వయంగా వాట్సప్ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

తబ్లిఘీ సంస్థ వర్కర్లతో కరోనా వ్యాప్తి మరింత పెరిగిపోవడంతో ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీనుద్దేశించి కొందరు పుకార్లను షురూ చేశారు. పాత వీడియోలను, మన దేశానికి సంబంధం లేని వీడియోలను వాట్సప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేశారు. దాంతో ముస్లింలలో విపరీతమైన ఆందోళన పెరిగిపోయింది. అదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామి వారి కైంకర్యాలను నిలిపి వేశారని, ఆఖరుకు నైవేద్యం కూడా కరెక్టు టైమ్‌కు నివేదించడం లేదని మరో వర్గం పుకార్లను లేపింది. ఇంకోవైపు కాణిపాకం ఆలయాన్ని క్వారెంటైన్ సెంటర్‌గా మార్చి అపవిత్రం చేశారంటూ ఇంకో వర్గం పుకార్లను రేపింది. లాక్ డౌన్ పీరియడ్‌లో మద్యం విక్రయాలంటూ కొందరు, లాక్ డౌన్ ఎత్తివేతపై మరికొందరు పుకార్లను రేపారు. వీటిలో ఎక్కువ వదంతులు వాట్సప్ వేదిక ద్వారానే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి.

పుకార్ల వ్యాప్తికి తమ వాట్సప్ వేదికే ప్రధాన మార్గంగా మారిన విషయాన్ని గుర్తించిన సంస్థ… తాజాగా ఓ కీలక మార్పు చేసింది. ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న సందేశాన్ని ఒకసారి ఒకే ప్లాట్ ఫామ్‌పై మాత్రమే పోస్టు చేసేలా టెక్నికల్‌గా మార్పు చేసింది. ఎక్కువగా అంటే మరీ ఫ్రీక్వెంట్‌గా ఫార్వర్డ్ అవతున్న మెసేజెస్‌ని గుర్తించి, ఒక సమయంలో ఒకేసారి మాత్రమే షేర్ చేసేలా సెట్టింగ్స్‌లో మార్పు చేసింది వాట్సప్ సంస్థ. అంటే.. ఒక మెసేజ్‌ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడం కుదరదన్నమాట. ప్రస్తుతం ఒక మెసేజ్‌ని ఒకేసారి అయిదుగురికి ఫార్వర్డ్ చేసే సౌకర్యం వాట్సప్‌లో వుంది. దానిని ఇపుడు ఒకసారి ఒకరికి మాత్రమే పంపేలా మార్పు చేసింది. మరొకరికి పంపాలంటే మరోసారి ఫార్వర్డ్ చేసేందుకు ప్రయత్నం చేయాల్సి వుంటుంది. తాజా మార్పు ద్వారా పుకార్లు, వదంతుల వ్యాప్తిని ప్రస్తుతం వున్నంత వేగంగా జరగదని వాట్సప్ భావించింది.