యూపీలో మరో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం..
యూపీలో క్రిమినల్స్ వేట కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇదిలావుంటే.. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను..

యూపీలో క్రిమినల్స్ వేట కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇదిలావుంటే.. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ ఉన్న ఇతర గ్యాంగ్‌స్టర్లు, వాంటెడ్ క్రిమినల్స్ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. తాజాగా శనివారం నాడు తెల్లవారు జామును మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఎన్‌కౌంటర్ చేసింది. బారా బంకీ ప్రాంతంలో టింకు కపాలా అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను హతమార్చారు. ఎస్‌టీఎఫ్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే కపాలాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. టింకు కపాలా తలపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



