హైదరాబాద్: తమిళ సూపర్ హీరో అజిత్ నటించిన విశ్వాసం మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. అందులో అజిత్ పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమాలో అజిత్ రెండు పాత్రల్లో నటించాడు. శివ దర్శకత్వం వహించగా, ఇమాన్ సంగీతం అందించాడు. ఇందులో నయనతార, జగపతి బాబు, వివేక్, రోబో శంకర్, కోవై సరళ తదితరులు నటించారు. తెలుగు ట్రైలర్‌లో అజిత్ పలికిన డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి.