వారందరికీ ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

| Edited By:

May 13, 2020 | 4:42 PM

వలస కార్మికులకు కూడా ఫ్రీగా బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది టీఎస్ హైకోర్టు. కరోనా వైరస్ లాక్‌డౌన్ వేళ రేషన్ కార్డులు రద్దు చేశారన్న పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ మేరకు రేషన్ కార్డులు లేని పేదలకు కూడా

వారందరికీ ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
Follow us on

వలస కార్మికులకు కూడా ఫ్రీగా బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది టీఎస్ హైకోర్టు. కరోనా వైరస్ లాక్‌డౌన్ వేళ రేషన్ కార్డులు రద్దు చేశారన్న పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ మేరకు రేషన్ కార్డులు లేని పేదలకు కూడా బయోమెట్రిక్ లేకుండా ఉచితంగా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వలస కార్మికులు ఎలాంటి ప్రభుత్వ ఫలాలు అందకుండా రోడ్డు పాలవుతున్నారని, దీంతో వారికి కూడా ఆహార భద్రత కల్పించాలని హైకోర్టు పేర్కొంది. అలాగే గిరిజనులకు బయోమెట్రిక్ లేకుండా ఉచిత బియ్యం, నిత్యావసరాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read More:

రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!