హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్లకు సంబంధించిన కార్యక్రమాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. పార్టీ అభ్యర్థులుగా హోంమంత్రి మహమూద్‌అలీ, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతిరాథోడ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశంను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా మిత్రపక్షమైన ఎంఐఎంకు ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉన్నది. అయితే ఐదుగురు సభ్యులు ఏకగ్రీవం కానిపక్షంలో మార్చి 12న ఎన్నిక జరుగనున్నది.