ఎట్టకేలకు పరిష్కారమయిన విశాఖ పంచగ్రామాల భూమి సమస్య

విశాఖలోని పంచ గ్రామాల భూమి సమస్య ఎట్టకేలకు పరిష్కారమయ్యిందన్నారు ఏపీ రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. పంచ గ్రామాల భూ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ క్రమబద్దీకరణ, దాని విధివిధానాలను క్షుణ్ణంగా వివరించారు. పంచగ్రామాల బిల్లుపై గవర్నర్ సంతకం చేశారని చెప్పారు మంత్రి గంటా. రెండురోజుల్లో పత్రిక ప్రకటన విడుదల అవుతుందనీ, దానిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే.. అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమస్యను రాజకీయ చేయాలని చూసిన ప్రతిపక్షాలకు చివరకు […]

ఎట్టకేలకు పరిష్కారమయిన విశాఖ పంచగ్రామాల భూమి సమస్య

Edited By:

Updated on: Feb 21, 2019 | 7:31 AM

విశాఖలోని పంచ గ్రామాల భూమి సమస్య ఎట్టకేలకు పరిష్కారమయ్యిందన్నారు ఏపీ రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. పంచ గ్రామాల భూ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ క్రమబద్దీకరణ, దాని విధివిధానాలను క్షుణ్ణంగా వివరించారు. పంచగ్రామాల బిల్లుపై గవర్నర్ సంతకం చేశారని చెప్పారు మంత్రి గంటా. రెండురోజుల్లో పత్రిక ప్రకటన విడుదల అవుతుందనీ, దానిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే.. అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమస్యను రాజకీయ చేయాలని చూసిన ప్రతిపక్షాలకు చివరకు నిరాశే ఎదురైందని విమర్శించారు.