AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్‌కు వివరించారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో మంత్రి పువ్వాడ అజయ్.. గవర్నర్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ […]

బ్రేకింగ్:  ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 8:33 PM

Share

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్‌కు వివరించారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో మంత్రి పువ్వాడ అజయ్.. గవర్నర్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ అయ్యారు. రేపు( శుక్రవారం) ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కీలకాంశాలపై చర్చించినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే అక్టోబర్ 5న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని, సమ్మెకు దిగిన 48 వేలమంది కార్మికులు తమ ఉద్యోగులు కాదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కండక్టర్ మహేశ్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం మరో కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. ఇప్పటికే సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం హైకోర్టు ఇరు వర్గాలకు మొట్టికాయలు వేసింది. సమ్మెలతో ప్రజలను ఇబ్బంది పెట్టవందంటూ కార్మిక సంఘాలకు చెబుతూనే.. చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. దీంతో శుక్రవారం కోర్టు వాయిదా ఉన్నందున ప్రభుత్వం తన వాదన వినిపించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే గవర్నర్ తమిళసై రెండు రోజుల క్రితం ఉన్నపాటుగా ఢిల్లీ పయనమై రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఒక నివేదిక అందించారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?