ఈడీ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పత్రాలతో ఈడీ అధికారుల ముందు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గత వారం ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. 2015 మే 30న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ‘ఓటుకు […]

ఈడీ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి

Updated on: Feb 19, 2019 | 12:30 PM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పత్రాలతో ఈడీ అధికారుల ముందు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గత వారం ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

2015 మే 30న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్‌ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.