Supreme court rejected Vinay Sharma petition quetioning President Kovind decision: ఉరి శిక్షను వాయిదా వేయించుకునేందుకు నిర్భయ దోషులు చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు శుక్రవారం చెక్ పెట్టింది. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్‌ని కొట్టేసింది. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటీషన్‌ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
తన మానసిక పరిస్థితి బాగా లేదని, తనకు మానవీయ కోణంలో క్షమాభిక్ష ప్రసాదించాల్సిన రాష్ట్రపతి.. తన అభ్యర్థనను తోసిపుచ్చడం సమంజసం కాదని వినయ్ శర్మ సుప్రీంకోర్టులో నాలుగు రోజుల క్రితం పిటీషన్ దాఖలు చేశాడు. వినయ్ శర్మ పిటీషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. శుక్రవారం దాన్ని కొట్టివేసింది. శిక్షను వాయిదా వేయించుకునేందుకు నిర్భయ దోషులు ఒకరి తర్వాత మరొకరు న్యాయపరంగా వారికి వున్న వెసులుబాట్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలో వినయ్ శర్మ ఈ పిటీషన్‌ను దాఖలు చేశాడు.
Also read: Nirbhaya mother Ashadevi questions, Where is the justice?
నలుగురు నిందితులను ఒకేసారి ఉరి తీయాలన్న పటియాలా కోర్టు ఆదేశాల తర్వాత నిర్భయ దోషులకు శిక్ష ఎప్పుడు అమలవుతుందా అని యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో దోషులు న్యాయపరంగా వారికున్న సౌకర్యాలను వంతుల వారీగా వినియోగించుకుంటూ.. శిక్షను వాయిదా వేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.