Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు. మామూలుగా అయితే ఈ వర్షాలకు జనం సేదతీరేవారే! కానీ కరోనా కాలం కావడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయం వెంటాడుతోంది
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండటంతో మంచి సహకారమే అందుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 5 వేల కేసులు నమోదుచేశామన్నారు.
  • ఆరోగ్యసేతు యాప్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు... వ్యాధి లక్షణాలు, దగ్గర్లో ఎక్కడెక్కడ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయన్న సమాచాం లభిస్తుంది. వీటితోపాటు మనం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతానికి వెళ్తే అలర్ట్ వస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ యాప్‌ పనిచేయడం లేదు. దీంతో గందరగోళానికి పడిపోయిన వినియోగదారులు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వ్యాధి ప్రబలడం తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను, అంతర్జాతీయ స్థాయిలో పాటించబడిన పద్దతులను మనం అనుసరిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

నా హక్కులేవీ ? కన్నీటి పర్యంతమైన నిర్భయ తల్లి ఆశాదేవి

What about my rights: Nirbhaya's mother breaks down in court, నా హక్కులేవీ ? కన్నీటి పర్యంతమైన నిర్భయ తల్లి ఆశాదేవి

నిర్భయ తల్లి ఆశాదేవి  బుధవారం ఢిల్లీ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. జడ్జి ముందు చేతులు జోడించిన ఆమె.. ఈ కేసులో దోషులు నలుగురినీ ఏ తేదీన ఉరితీస్తారని ప్రశ్నించారు. . న్యాయం కోసం పోరాడుతున్న నా హక్కులేమయ్యాయి అన్నారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తన పాత లాయర్ ని తొలగించానని, కొత్త న్యాయవాదిని కుదుర్చుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరగా.. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు లాయరంటూ ఎవరూ లేరని పవన్ గుప్తా చెప్పడంతో.. తక్షణ ప్రాతిపదికపై అతనికి లీగల్ ఎయిడ్ ఇచ్చేందుకు కోర్టు సంసిధ్ధత వ్యక్తం చేసింది. అయితే ఈ ఎత్తుగడలన్నీ కేసును జాప్యం చేసేందుకేనని నిర్భయ తల్లి ఆరోపించారు. ఈ దోషుల న్యాయ సహాయాలన్నీక్లియర్ చేయాలని, వీరికి త్వరగా ఉరి శిక్ష పడేలా చూడాలని తాను ఏడాదిన్నరగా కోర్టును కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు వారం రోజుల వ్యవధిని ఇచ్చింది గనుక ఇటీవల మీరు డెత్ వారెంట్ జారీ చేయలేదని, ఇప్పుడు ఈ దోషుల్లో ఒకడు తనకు న్యాయవాది లేరంటున్నాడని చెప్పిన ఆమె.. తాను న్యాయం కోసం ఎదురుచూస్తున్నానని దీనంగా వ్యాఖ్యానించింది. అసలు నా హక్కులేవీ అని ప్రశ్నించగా.. ‘ మీ హక్కుల గురించి ప్రతివారూ యోచిస్తున్నారని, అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని న్యాయమూర్తి అన్నారు.

దోషికి లీగల్ ఎయిడ్ కోరే న్యాయబధ్ధమైన హక్కు ఉందని జడ్జి చెప్పగా.. ఇది తన కుమార్తెకే జరుగుతున్న అన్యాయమని నిర్భయ తండ్రి అన్నారు. కానీ ఆయనతో జడ్జి….  అది సరికాదన్నారు. దోషులైన ముకేష్, పవన్, వినయ్, అక్షయ్ లలో ఎవరూ లీగల్ ఆప్షన్ ఎంచుకోలేదని తీహార్ జైలు అధికారులు మంగళవారం ట్రయల్ కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు.

 

 

 

Related Tags