AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్తు చేస్తున్న హత్యలు

జనాలు మద్యానికి బానిసలవ్వడానికి కారణాలేంటి? ఒకటా? రెండా? కర్ణుడు చావుకు వంద కారణాలన్నట్టు చాలా కారణాలు మనకు తారసపడతాయి. కేవలం మద్యం మాత్రమే కాదు డ్రగ్స్ కూడా భారీ స్థాయిలోనే ప్రాణాలు పొట్టన పెట్టుకుంటుంది. డ్రగ్స్, మద్యపానం, ఆత్మహత్యల వల్ల చనిపోయిన వారి సంఖ్య ఒక్క 2017లోనే ప్రపంచవ్యాప్తంగా 1, 50, 000 వేల మంది ఉన్నారంటే దాని తీవ్రత ఎంతో అర్ధం చేసుకోవచ్చు. 1999 తో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విషయం. మానసిక […]

మత్తు చేస్తున్న హత్యలు
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2019 | 6:41 PM

Share

జనాలు మద్యానికి బానిసలవ్వడానికి కారణాలేంటి? ఒకటా? రెండా? కర్ణుడు చావుకు వంద కారణాలన్నట్టు చాలా కారణాలు మనకు తారసపడతాయి. కేవలం మద్యం మాత్రమే కాదు డ్రగ్స్ కూడా భారీ స్థాయిలోనే ప్రాణాలు పొట్టన పెట్టుకుంటుంది. డ్రగ్స్, మద్యపానం, ఆత్మహత్యల వల్ల చనిపోయిన వారి సంఖ్య ఒక్క 2017లోనే ప్రపంచవ్యాప్తంగా 1, 50, 000 వేల మంది ఉన్నారంటే దాని తీవ్రత ఎంతో అర్ధం చేసుకోవచ్చు. 1999 తో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విషయం. మానసిక ఒత్తిళ్లు, మత్తు నుంచి బయటకు రాలేకపోవడం, కుటుంబం, సమాజం నుంచి చీత్కారాలు వీరిని ప్రధానంగా ఆత్మహత్యలు వైపు పురిగొల్పులున్నాయి.

ఇదిలా వుంటే మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా భావించి మద్యం వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో మద్యం వినియోగం గడిచిన పన్నెండు ఏళ్ళలో రెట్టింపు అయ్యింది. తెలుగు రాష్ట్రాలైతే ముందంజలో ఉన్నాయి. కొత్త సంవత్సర వేడుకల సమయంలోనే రాష్ట్రంలో దాదాపు వంద కోట్ల విలువైన మద్యం తాగారని ఎక్సైజ్‌ శాఖ లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని 16 కోట్ల మంది ప్రజలు అంటే మొత్తం ప్రజల్లో 14.6 శాతం మంది మద్యానికి బానిసలుగా మారినట్లు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఎయిమ్స్‌తో కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మద్యం అధికంగా సేవించడం వల్ల 2016లో ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది చనిపోయారని, ప్రపంచంలో ప్రతి 20 మరణాలలో ఒక మరణం మద్యపానం వల్లనే జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య శాఖ లెక్కలు తెలుపుతున్నాయి.

ఎన్నో లక్షల మంది మద్యానికి బానిసలై తమ కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నారు. కోట్ల మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల్లో అత్యధిక శాతం మంది మద్యం మత్తులో చేస్తున్న వారే. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువ భాగం మద్యం మత్తులో జరుగుతున్నవే. అతి మద్యపానం వల్ల ప్రజలు, కుటుంబాలు, సమాజాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. ఇంతటి విపరీత పరిణామాలకు దారితీస్తున్న మద్యపానంపై అవగాహన రావాలంటే పాఠశాలల్లోనే మద్యపాన అనర్థాలు తెలిపే పాఠ్యాంశాలు చేర్చాలి. విద్యార్థులకు, యువతకు, ప్రజలకు మద్యపాన అనర్థాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసే పాలకులను ప్రజలు ఎంపిక చేసుకోవాలి.